ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే.. విడాకులు ఖాయం.! 2024-06-27 19:00:52

న్యూస్ లైన్ డెస్క్: పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం. అలాంటి పెళ్లిని ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మంచి ముహూర్తం మరియు జాతకాలు చూసి పెళ్లి చేస్తూ ఉంటారు. ఇవన్నీ సెట్ అయితేనే పెళ్లి సెట్ చేస్తారు. ఈ విధంగా సాంప్రదాయం ప్రకారం చేసుకున్న పెళ్లిళ్లు జీవితకాలం బాగుంటాయని నమ్ముతారు. కానీ ఈ పెళ్లిల తేదీల్లో ముహూర్తం ఏమాత్రం మిస్టేక్ అయినా పెళ్లి తర్వాత,  అనేక విధాలుగా సమస్యలు వస్తాయని అంటుంటారు.  

అలాంటి పెళ్లి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి తప్ప, ఏమాత్రం మిస్టేక్ చేసినా విడాకులు తప్పవని పండితులు అంటున్నారు.  ముఖ్యంగా ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే విడాకులు తప్పనిసరిగా ఉంటాయట. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. పెళ్లి చేసుకునే తేదీల్లో ఏడవ తేదీ అంతగా కలిసి రాదని పండితులంటున్నారు.  అంతేకాకుండా 16, 25 తేదీల్లో కూడా పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ డేట్ లో పెళ్లి చేసుకుంటే జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదురై విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే  8, 17, 26 తేదీలలో కూడా వివాహం చేసుకోకూడదని తెలియజేస్తున్నారు.

ఈ టైంలో పెళ్లి చేసుకున్న వారు కూడా జీవితంలో ముందుకు వెళ్లలేక విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఈ సమయంలో పెళ్లి చేసుకున్న వ్యక్తుల మధ్యకి మూడో వ్యక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. పండితులు చెప్పిన దాని ప్రకారం 14, 5, 23 తేదీల్లో కూడా పెళ్లి చేసుకోరాదట.  పెళ్లి చేసుకుంటే అన్నీ అశుభ ఫలితాలు వచ్చి తొందరగా విడిపోతారని పండితులు అంటున్నారు.