KFC: ఇక పై KFC తో ఫ్రైడ్ చికెన్ ఒక్కటే కాదు ...టూత్ పేస్ట్ కాదు !

మార్కెట్ లోకి వచ్చిన రెండు రోజుల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది. కేఎఫ్ సీ చికెన్ టేస్ట్ లోనే ఈ పేస్ట్ ఉండడం చాలా స్పెషల్ .


Published Apr 11, 2025 11:13:00 AM
postImages/2025-04-11/1744350264_dssd17442570172561744257023210.png

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: KFC పేరు తెలియని వాళ్లు ఎవరుంటారు. ఫ్రైడ్ చికెన్ ను ఇష్టపడనవారుఉండదు.KFC నుంచి ఇప్పుడు టూత్ పేస్ట్ ను కూడా ఇంటడ్యూస్ చేసింది. కేఎఫ్ సీ సంస్థ తాజాగా ఫ్రైడ్ చికెన్ రుచి కలిగిన టూత్ పేస్ట్ ను విడుదల చేసింది. దీనిని మూలికలు , సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేక రుచి ప్రజలకు బాగా నచ్చడంతో మార్కెట్ లోకి వచ్చిన రెండు రోజుల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది. కేఎఫ్ సీ చికెన్ టేస్ట్ లోనే ఈ పేస్ట్ ఉండడం చాలా స్పెషల్ .


అయితేఇది పర్మినెంట్ గా రిలీజ్ చేసిన టూత్ పేస్ట్ కాదు . జస్ట్ టెంపరరీ కి రిలీజ్ అయ్యింది. హిస్మైల్ తో కలిసి పరిమిత కాలానికి మాత్రమే ఈ ప్రాడెక్ట్ ను రిలీజ్ చేసింది.హిస్మైల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ కోబన్ జోన్స్ మాట్లాడుతూ, "కేఎఫ్‌సీ ప్రసిద్ధ రుచులను రోజువారీ అవసరాల్లో చేర్చడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు. మీరు దీనిని నోటిలో పెట్టుకుంటే, కేఎఫ్‌సీ ఒరిజినల్ రెసిపీ చికెన్ వేడి, జ్యుసి ముక్కను తింటున్నట్లు అనిపిస్తుంది" అని అన్నారు.


రెండు రోజుల్లో అనుకున్న దాని కంటే మంచిగా అమ్ముడయ్యాయి. అయితే ఈ టూత్ పేస్ట్ ఈ టూత్‌పేస్ట్ హిస్మైల్ వెబ్‌సైట్‌లో 13 డాలర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ టూత్ పేస్ట్ ను కొనాలని  ప్లాన్ చేస్తున్నవారు తదుపరి స్టాక్ వచ్చే వరకు వేచి ఉండాలి. కానీ హిస్మైల్ వెబ్ సైట్ లో 59 డాలర్లకు అందుబాటులో ఉన్న కొత్త కేఎఫ్ సీ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tooth-bresh market

Related Articles