అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్ , అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృధ్ధే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ అదే స్పేడెకస్ మిషన్ సక్సస్ అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ ఎల్వీ -సీ 60 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్ , అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృధ్ధే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు.