పాకిస్థాన్ జట్టు 40 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఖుష్ దిల్ షా ఆ దేశ క్రికెట్ అభిమానులపైనే దాడికి దిగాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాపం ఈ మధ్య పాకిస్థాన్ తో మూడు వన్డేల సీరీస్ ను న్యూజిల్యాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శనివారం లాస్ట్ మ్యాచ్ లో కివీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 40 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఖుష్ దిల్ షా ఆ దేశ క్రికెట్ అభిమానులపైనే దాడికి దిగాడు.
ఈ మధ్య పాకిస్థాన్ ప్లేయర్ల ఆటతీరు అంత బాలేదని పాక్ అభిమానుల అభిప్రాయం. దీంతో డగౌట్ లో ఉన్న ఖుష్ దిల్ షాని టార్గెట్ చేసిన పాక్ ఫ్యాన్స్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది . మొదట బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ అభిమానులు రెచ్చిపోయారని ..తర్వాత ఖుష్ దిల్ కోపంగా వారిపై దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే దుర్భాషలాడిన వారిలో ఎక్కువ శాతం ఆఫ్ఘనిస్థాన్ వారే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది. విదేశీ ప్రేక్షకులు పాక్ ఆటగాళ్ల పట్ల అసభ్యకరమైన భాషను ఉపయోగించారని ఆరోపించింది. ‘‘పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి విదేశీ ప్రేక్షకులు దుర్భాషలాడడాన్ని పాకిస్థాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఇవి వారి మానసిక ఒత్తిడిని మరింత పెంచుతాయని పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే క్రికటర్ భరించలేక దాడి చేశారని తెలిపింది పీసీబీ.