స్టేట్స్ వాళ్లు కూడా బ్యాంకులు , స్కూల్స్ సెలవు ప్రకటించారా లేదా అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఢిల్లీలోని అతిశీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి కేంద్రమంత్రిత్వశాఖ వారం రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశమై సంతాప దినాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చిస్తుంది.
మన్మోహన్ మృతి సందర్భంగా కేంద్రం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించగానే కర్ణాటక ప్రభుత్వం నేడు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు , విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. దీని వల్ల మిగిలిన స్టేట్స్ వాళ్లు కూడా బ్యాంకులు , స్కూల్స్ సెలవు ప్రకటించారా లేదా అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఢిల్లీలోని అతిశీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.
భారతీయ రిజర్వు బ్యాంకు సెలవుల క్యాలెండర్ ప్రకారం.. నాగాలాండ్‌లోని కోహిమా ప్రాంతంలో మాత్రమే నేడు బ్యాంకులకు సెలవు. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడ సెలవు ప్రకటించారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు పాటిస్తున్నాయా? లేదా? అన్నదానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు బ్యాంకులు , స్కూల్స్ సెర్చ్ చేస్తున్నారన్నారట.