Megastar Chiranjeevi : యూకే పార్లమెంట్ లో చిరు కు అరుదైన గౌరవం !

మార్చి 19 న యూకే పార్లమెంట్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సోజన్ జోసెఫ్ , బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.


Published Mar 14, 2025 06:19:00 PM
postImages/2025-03-14/1741956598_chiranjeevi1650970003.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవికి చాలా అరుదైన గౌరవం దక్కింది. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో చిరంజీవికి గౌరవ సత్కారం జరగనుంది. దాదాపు 40 ఏళ్లుగా సినిమాల ద్వారా కళారంగానికి , సమాజానికి చేసిన సేవలకుగాను చిరంజీవిని యూకే అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా సన్మానించారు. మార్చి 19 న యూకే పార్లమెంట్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సోజన్ జోసెఫ్ , బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.


బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఓ ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అంద‌జేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండ‌టం విశేషం.2024 లో భారత ప్రభుత్వం నుంచి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను చిరంజీవి అందుకున్న సంగతి తెలిసిందే.  విశ్వంబర మూవీ ..యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. చిరంజీవి విశ్వంభర మూవీ తర్వాత అనిల్ రావిపూడితో కామెడీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మాస్ సినిమా చేయబోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu america

Related Articles