KIDS: పిల్లలకి ఇవి కొంటున్నారా .. పక్కా డబ్బు వృధా చేస్తున్నట్టే ! 2024-06-19 20:18:49

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇంట్లో చిన్నపిల్లలుంటే అవసరమైనవి ..కానివి..అసలు ముద్దుగా కనిపించే ప్రతి వస్తువు కొనేస్తుంటారు. అసలు కొన్ని వస్తువులు పిల్లలకు అవసరం లేకుండా ఎన్ని కొంటున్నారో..అలా మీ డబ్బులు వృధా చేసుకుంటూ కొనే అనవసర వస్తువుల చిట్టా చెప్తాం చూడండి.


బేబీ షూస్ :
బేబీ షూస్( BABY SHOES)  పిల్లలకు దాదాపు ఏడాది వరకు చెప్పులు కాని షూస్ కాని అవసరం లేదు. కాని ముద్దుగా ఉన్నాయని తెగ కొనేస్తుంటారు. కాని పిల్లలు యేడాది లోపు వేసే అడుగులు అంత స్పష్టంగా ఉండవు. దీని వల్ల నేలమీద వేసే అడుగులు వారు పడిపోకుండా సేఫ్ గా ఉంటాయి. వారికి రక్తప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది. సో బేబీ షూస్ మీద మీరు పెట్టే ఖర్చు వృధా.


బేబీ పౌడర్ :
బేబీ పౌడర్( BABY POWDER)  నిజానికి బేబీ పౌడర్ వాడితే ...పిల్లలకు దాదాపు లంగ్ క్యాన్సర్ వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయినా ...ఇప్పటికి బేబీపౌడర్ వాడుతున్నారు. సో మీకు వీలైతే బేబీ పౌడర్ వాడకండి. దీని మీద పెట్టే డబ్బులు వృధా ఖర్చే.


బెడ్డింగ్ యాక్సిసరీస్:
పిల్లలకు బెడ్డింగ్ యాక్సిసరీస్( BED SETTINGS)  ఏం కొన్నా అవి వేస్టే. పిల్లలకు మీరు మెత్తగా ఉండాలని బెడ్ సెట్టింగ్స్ కొంటున్నారు కదా..వీటి వల్ల పిల్లలకు వెన్నుముక షేప్ ఛేంజ్ అవుతుంది. కాబట్టి ఎంత ఫ్లాట్ గా ఉన్న ప్లేసులో పడుకోబడితే..మీ పిల్లలకు అంతమంచిది. సో బెడ్డింగ్ యాక్ససరీస్ ఏం కొన్నా మీ డబ్బులు వేస్ట్.


రాకర్స్ ,బౌన్సర్స్ 
బేబీస్ కి ఈ రాకర్స్అండ్ బౌన్సర్స్ ( ROCKERS AND BOUNCERS)వాడడం వల్ల  ఖర్చు వేస్ట్ తప్ప...మరొకటి లేదు. ఈ రాకర్స్ వాడడం వల్ల పిల్లలకు మంచిది కాదు...ఎందుకు అంటే ఈ బౌన్సర్స్ వల్ల చిన్నారుల మెడ భాగం నొప్పి గా ఉంటుంది. దీని వల్ల చిన్నారులకు నష్టమే కాని లాభం లేదు.


ఫుడ్ ప్రాసెసర్స్ 
ఫుడ్ ప్రాసెసర్స్( FOOD PROCESSERS) కంటే నార్మల్ ఫుడ్ మనం ఇంట్లో చేసుకునే ..ఫుడ్ బెస్ట్ ..సో ఇలాంటి వాటిని దూరంగా ఉండడమే బెస్ట్.