New countries: ఈ మధ్యే పుట్టిన బుల్లి బుల్లి దేశాలివి ? 2024-06-30 15:16:11

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యుధ్ధాలు...ఎంతో మంది స్వేఛ్ఛ ( FREEDOM) కావాలని కోట్లాడుకున్నారు...సమానత్వం కోసం కూడా యేళ్లకు యేళ్లు కొట్టుకొని ఈ మధ్యే తమకంటు ఓ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న దేశాలను చూసేద్దాం. అందులోనూ ఆఫ్రికా, యూరప్ ( EUROPE COUNTRIES) ఖండాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అలా ఈ మధ్య పుట్టిన కొత్త దేశాలేవంటే.. అందులో పది దేశాల గురించి తెలుసుకుందాం.


* సూడాన్( SUDAN) దేశం ఎన్నో దశాబ్దాల పాటు కొనసాగిన అంతర్యుద్ధంతో.. 2011 జూలై 9న దక్షిణ సూడాన్ తమ దేశాన్ని ఏర్పాటు చేసుకుంది.


* సెర్బియా( SERBIA)  దేశం నుంచి 2008 ఫిబ్రవరి 17న కొసావో స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. స్వాతంత్ర్య దేశంగా గుర్తింపు వచ్చింది ప్రపంచ దేశాలు కూడా గుర్తించాలిగా ..ఇంకా ప్రాసెస్ నడుస్తుంది.


* మొదట్లో సెర్బియా అండ్ మాంటెనెగ్రో యూనియన్ ఆఫ్ స్టేట్ గా ఉండేవి. 2006లో జరిగిన రెఫరెండం ద్వారా మాంటెనెగ్రో, సెర్బియా రెండూ కొత్త దేశాలుగా ఏర్పాటయ్యాయి.


* ఇండో నేషియా( INDONESIA) నుంచి 2002 మే 20న ఈస్ట్ తైమూర్ స్వాతంత్ర్యం పొంది కొత్త దేశంగా ఏర్పాటైంది.
* అమెరికా వలస స్థావరంగా ఉన్న పలావ్( PALAV) .. 1994 అక్టోబర్ 1న ప్రత్యేక దేశంగా స్వాతంత్ర్యం పొందింది.
* ఇథియోపియాలో జరిగిన అంతర్యుద్ధం పర్యవసానంగా 1993 మే 24న ఎరిత్రియా కొత్త దేశంగా ఏర్పాటైంది.
* చెకొస్లోవేకియా 1993 జనవరి 1 రెండు దేశాలుగా విడిపోయింది. చెక్ రిపబ్లిక్, స్లోవేకియా కొత్త దేశాలుగా ఏర్పడ్డాయి.
* 1991 జూన్ 25న క్రొయేషియా కూడా స్వతంత్ర దేశంగా ఏర్పడింది.