ఈ నెలలో దాదాపు 5 వేల జంటలు ఒకటి కానున్నాయి. ఈ నెలలో పెళ్లిళ్లు , గృహ ప్రవేశాల లాంటి శుభకార్యాలు ...పెళ్లి మాటలు..ఇలా చాలా శుభకార్యాలు ఉన్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దీపావళి పండుగ అయిపోయింది. దీపావళి అమావాస్య అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి అన్ని పెళ్లి ముహూర్తాలే. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ పెళ్లి ముహూర్తాలు మొదలవుతున్నాయి. అయితే ఈ నెలలో దాదాపు 5 వేల జంటలు ఒకటి కానున్నాయి. ఈ నెలలో పెళ్లిళ్లు , గృహ ప్రవేశాల లాంటి శుభకార్యాలు ...పెళ్లి మాటలు..ఇలా చాలా శుభకార్యాలు ఉన్నాయి.
నవంబర్ నెలలో 3, 7, 8, 9, 10, 13, 14,15, 16, 17,
డిసెంబర్ నెలలో 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18, 2
మరో మూడు మాసాలు శుభ ముహూర్తాలు ఉన్నాయని, యాదాద్రి క్షేత్రంలోని ప్రధానాలయ పూజారులు, పంచాంగకర్తలు, బ్రాహ్మణ పూజారులు చెబుతున్నారు. దీంతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే క్రతువులు అంటే పెళ్లి చూపులు, మాటాముచ్చట్లు ముమ్మర మయ్యాయి. వచ్చే నెల 3 నుంచి శుభ ముహూర్తాలు మొదలై, 20 వరకు 12 శుభముహూర్తాలున్నట్లుగా పండితులు చెబుతున్నారు.ఈ ముహూర్తాల్లో 5 వేల జంటలకు పైగా పెళ్లి చేసుకుంటున్నారు.625 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
డిసెంబరు(మార్గశిరం) నెలలో 4, 5, 6, 11, 20, 25 తేదీల్లో వివాహ బంధాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 2, 7 తేదీల్లో ఉదయం, రాత్రి మంచి ముహూర్తాలు ఉన్నాయి. 13న ఉదయం, 14వ తేదీ రాత్రి, 16 వ తేదీన మూడు వేళల్లో ముహూర్తాలున్నాయి. 20వ తేదీ రెండు, 22, 23 తేదీల్లో రెండేసి ముహూర్తాలున్నాయి. ఫాల్గుణంలో వచ్చే మార్చి 2వ తేదీన ఉదయం రెండు, రాత్రి రెండు శుభ ముహూర్తాలున్నాయి. 6వ తేదీన 3 వేళల్లో కల్యాణ ఘడియలు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా 625 కోట్ల బిజినెస్ జరుగుతుందని ట్రేడర్స్ అంచనావేస్తున్నారు. మరింత ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.