అయ్యప్ప ఆలయంలో మండల-మకరవిలక్కు యాత్ర సీజన్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇలా స్వామి వారి దర్శనానికి వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది కేరళ ప్రభుత్వం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కార్తీకమాసం వచ్చిందంటే అయ్యప్ప దీక్షలు మొదలవుతాయి. ఏపీ , తెలంగాణ , తమిళనాడు , కర్ణాటక రాష్ట్రంలో అయ్యప్ప మాల వేస్తుంటారు. భారీగా స్వామి ని కీర్తిస్తూ మండల దీక్షలు చేపడతారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అయ్యప్ప ఆలయంలో మండల-మకరవిలక్కు యాత్ర సీజన్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇలా స్వామి వారి దర్శనానికి వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది కేరళ ప్రభుత్వం.
అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రికులు అందరికీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) ఒక్కొక్కరికీ రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది. ఈ విషయాన్ని కేరళా రాష్ట్రదేవస్థాన శాఖా మంత్రి వీఎన్ వాసవన్ తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయం గురించి చర్చించినట్లు దేవస్థానం మంత్రి వాసవన్ తెలిపారు.
ఆన్‌లైన్ టిక్కెట్లతో పాటు స్పాట్ బుకింగ్ దర్శనాలకు అనుమతిస్తామని దేవస్థానం బోర్డు తెలిపింది. అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా దర్శనం కల్పించేందుకు కొండ కింద గుడి వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. స్వామి మాల లో దర్శనం చేసుకునే క్రమంలో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు పరిహారం అందించనున్నారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని సొంతూరు చేరుకునే వరకు పూర్తి బాధ్యత కేరళ ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. గతేడాది శబరిమల జనాన్ని అంచనా వెయ్యలేకపోయింది కేరళ ప్రభుత్వం. ఈ ఏడాది ఎన్ని లక్షల మంది వచ్చినా ..ఏర్పాట్లు కంప్లీట్ గా జరిగాయని తెలిపారు.