ఆ బాబు 56 వస్తువులు మింగేశాడు. పొట్ట నిండా ఇనుప వస్తువులతో నిండి ఉంది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ సజిస్ట్ చేశారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కడుపునొపపి , బ్రీతింగ్ ఇష్యూస్ ఓ 15 యేళ్ల కుర్రాడిని హాస్పటిల్ కు తీసుకువచ్చారు పేరెంట్స్ . సరే స్కాన్ చేద్దాం...ఎందుకు కడుపునొప్పో చూసేద్దాం అంటూ సజిషన్ ఇచ్చిన డాక్టర్ కు ..దిమ్మతిరిగిపోయింది. ఓరే బాబు ఏమేం మింగి చచ్చావ్ రా ..పొట్ట చెత్త బుట్టలా ఉందంటు తెగ తిట్టిపారేశాడు. ఇంతకీ స్కానింగ్ లో ఏముందంటే ...ఆ బాబు 56 వస్తువులు మింగేశాడు. పొట్ట నిండా ఇనుప వస్తువులతో నిండి ఉంది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ సజిస్ట్ చేశారు. ఆపరేషన్ చేశారు. కాని కుర్రాడిని మాత్రం కాపాడలేకపోయారు డాక్టర్లు.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో చోటుచేసుకుందీ ఘటన.హత్రాస్ కు చెందిన పదిహేనేండ్ల బాలుడు ఆదిత్య స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చాలా హాస్పటిల్స్ లో చూపించా ఫలితం లేదు. అయితే అతని పొట్టలో మేకులు , బ్లేడ్స్ , స్క్రూలు, లాంటివే కాకుండా బ్యాటరీలు కూడా మింగాడు. అయితే ఇలా 56 వస్తువులు తన పొట్టలో ఉన్నాయి. ఇది ఎన్ని నెలల నుంచి పొట్టలో ఉన్నయనేది తెలీదు కాని ఇనుప వస్తువుల కారణంగా పొట్ట కు కాని ప్రేగులకు కాని గాయాలు లేవు.
ఆదిత్య గొంతుకు కానీ, ప్రేగులకు కానీ ఎలాంటి గాయం కాకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆదిత్యను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆసుపత్రిలో ఆదిత్యకు ఆపరేషన్ చేయగా.. ఆ మరుసటి రోజు ఆదిత్య చనిపోయాడని తల్లిదండ్రులు వివరించారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు డాక్టర్లు.