ఓ బట్టల దుకాణం ఉంది. శనివారం ఎప్పటిలాగే తన షాపులో కూర్చున్న శాస్త్రి.. వచ్చిన కస్టమర్లకు బట్టలు చూపిస్తున్నాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏంటో ఈ ఆంటీ , అంకుల్ గోల...పోనీ ..అన్నది ఏమైనా పడుచుపిల్లాడా అంటే కానే కాదు...ఆయన వయసు 60 దాటి ఉంటుంది. ఈ కుర్రాడు వయసు దాదాపు 30 కూడా దాటవు...ఆయన కావాలని అంకుల్ అని పిలిస్తే ...ఫీలవ్వకుండా ఉంటారా చెప్పండి. దాదాపు అందరికి ఇదే సిట్యువేషన్. ఓరే బాబు ...ప్రపంచంలో అక్క, చెల్లి , ఏవండి..దీదీ , బాబీ...భయ్యా ...సార్ ...దాదా లాంటి పదాలు మరిచిపోయారు. ఈ దిక్కుమాలిన అంకుల్ , అంటీ బాధేంటో ..చాలా మందికి గొడవల కారణం కూడా ఇదే. అసలు కొంతమంది కావాలని చేస్తుంటారు చూడండి. వారిని కొట్టినా తప్పులేదనిపిస్తుంటుంది. అదే పనిచేశాడు భోపాల్ కు చెందిన వ్యక్తి.
భోపాల్ కు చెందిన విశాల్ శాస్త్రికి స్థానికంగా జాట్ ఖేడి ప్రాంతంలో ఓ బట్టల దుకాణం ఉంది. శనివారం ఎప్పటిలాగే తన షాపులో కూర్చున్న శాస్త్రి.. వచ్చిన కస్టమర్లకు బట్టలు చూపిస్తున్నాడు. ఇంతలో భుజాన చంటిపిల్లాడితో ఓ జంట వచ్చింది. చీరలు కావాలనడంతో శాస్త్రి తన షాపులోని వివిధ వెరైటీలను చూపించాడు. అయితే షాపు ఓనర్ కు ఓ 60 పైనే ఉంటాయి..ఈయన వచ్చిన కస్టమర్ ను అంకుల్ మీకు ఏ రేటులో కావాలో చెప్పండి అంటూ శాస్త్రిని అడిగాడు. తన వైఫ్ తో వచ్చిన తనని అంకుల్ అని పిలవడంతో సదరు కస్టమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
శాస్త్రితో వాగ్వాదానికి దిగాడు. అతడి భార్య సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. గొడవ ముగిసిందని అనుకునేలోపే సదరు కస్టమర్ తన స్నేహితులతో వచ్చి శాస్త్రిపై దాడి చేశాడు. ఎంత హార్ట్ అయ్యాడో తెలీదు కాని మరీ దారుణంగా బయటకు లాగి ...బెల్ట్ లతో , రాడ్లతో , హాకీ స్టిక్స్ తో చితకబాదారు. ఇదంతా షాపు ముందున్న సీసీటీవీ కెమరాలో రికార్డ్ అయ్యింది. ఇఫ్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.