kids: డియర్ పేరెంట్స్ ...ఇలాంటి మాటలే పిల్లల మనసు విరిచేస్తాయ్! 2024-06-20 21:23:17

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిన్న పిల్లలు ..వారికి మీరు మాట్లాడే మాటలు వాటి అర్ధాలు ...సరిగ్గా తెలీవు. వారికి తెలిసిందల్లా మీరు ఎలా మాట్లాడుతున్నారు...గట్టిగా మాట్లాడుతున్నారా...తిడుతున్నారు...మెల్లగా మాట్లాడితే పాజిటివ్ ( positive) గా కన్వే అవుతుంది. కొన్ని మాటలు వారి మనసును ఎంతలా విరిచేస్తాయంటే...వారికి ఎన్ని యేళ్లు ఉన్నా గుర్తుండిపోతాయి. 


కోపంతో కొందరు పేరెంట్స్( parents)  నోరు జారతారు.  కోపంలో మనం ఏదో అనేస్తాం.. తర్వాత మళ్లీ పిల్లలతో సరిగానే ఉంటాం. కానీ.. ఆ మాట మాత్రం పిల్లలపై చిన్ని గుండెను గాయం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


1.నీ వల్ల నాకంటూ టైమ్( time)  లేకుండా పోతోంది, మా సంతోషానికి నువ్వు అడ్డుగా మారావు.. లాంటి మాటలు పిల్లలతో అనకండి.  మీరు కోరుకుంటున్న సంతోషం.. వారు కాస్త పెద్ద అయ్యాక అయినా దొరుకుతుంది. ఇలాంటి మాటలు అసలు వారి ముందు అనకండి...నువ్వు లేకపోతే  నాకు టైం గడవదు ...ఈ మాట పిల్లల ఆనందాన్ని వెయ్యి రెట్లు పెంచుతుంది.


2.  మీకు కావాల్సినవి కొనుక్కున్నపుడు ..వారికి కావాల్సినవి అడిగితే..వెంటనే లేదు ..కాదు అనకండి...ఈ మంథ్ ( month) ఈ ఖర్చులు ఉన్నాయి...తర్వాత చూద్దామని చెప్పండి. మీ దగ్గర డబ్బులున్నపుడు కచ్చితంగా వాటిని కొని ఇవ్వండి. దీని వల్ల  కావాల్సినవి మా పేరెంట్స్ ఇస్తారనే నమ్మకం ఉంటుంది. అంతేకాదు మా నాన్న దగ్గర డబ్బులుంటే ఇస్తాడనే నమ్మకం వారి కలిగితే మీపిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు.


3.పెళ్లి వెంటనే పిల్లలు( kids)  పుడుతూ ఉంటారు. అయితే... ఈ విషయాన్ని పిల్లల ముందు చెప్పకూడదు. మేము నిన్ను కావాలి అనుకోలేదు.. వద్దు అనుకున్నా కూడా పుట్టావ్ లాంటి మాటలు పొరపాటున కూడా పిల్లల ముందు అనొద్దు. పిల్లలకు అసలు మనసు విరిగిపోతుంది.


 4.ఇక పిల్లలు అందరూ అన్ని విషయాల్లో సూపర్ గా ఉండరు. కొన్నిసార్లు మనం అనుకున్నదాంట్లో వారు సక్సెస్( sucess)  కాలేకపోవచ్చు. అలా అని.. నువ్వు ఎప్పుడూ ఇంతే.. మమ్మల్ని నిరుత్సాహ పరుస్తూనే ఉంటావ్ లాంటి మాటలు అనొద్దు. వాళ్లు విజయం వైపు వెళ్లాలనే ఆలోచన పోయి ..లూజర్స్ గానే మిగిలిపోతారు.


5.పిల్లలలకు ఇతరులతో పోల్చడం నచ్చదు. అది తోడబుట్టిన వారు అయినా కూడా ఇష్టపడరు. మీరు ప్రతి నిమిషం తోడబుట్టిన( siblings)  వారితోనే, స్నేహితులతోనో( friends)  పోలిస్తే.. వారి పట్ల పిల్లలకు ద్వేషం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఇలాంటి మాటలుు అనుకుండా ఉండటమే మంచిది.