kids: పిల్లలకు డబ్బు విషయంలో పేరెంట్స్ ఇవి నేర్పాల్సిందే ..!

డబ్బు అనేది తేలికగా వచ్చేది కాదు . చాలా కష్టపడితేనే వస్తుందని  వారికి తెలిసేలా చెయ్యాలి. పొదుపు ప్రాముఖ్యతను అర్ధం చేసుకునేలా పిల్లల్ని మార్చుకొండి.


Published Oct 19, 2024 06:35:00 PM
postImages/2024-10-19/1729343168_maxresdefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పిల్లలు ప్రతి విషయంలో పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. తల్లితండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక శ్రధ్ధ పెట్టి అన్ని వివరించాలి. ముఖ్యంగా డబ్బులు గురించి వారికి అర్ధమయ్యేలా చెప్పాలి. ఆహారం, దుస్తులు వంటి అవసరాలని కొనుగోలు చేయడానికి బొమ్మలు వంటి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బు ఉపయోగించే విధానాన్ని వాళ్ళకి చెప్పాలి. వారికి మెల్లగా అర్ధమయ్యేలా చెప్పాలి. డబ్బు అనేది తేలికగా వచ్చేది కాదు . చాలా కష్టపడితేనే వస్తుందని  వారికి తెలిసేలా చెయ్యాలి. పొదుపు ప్రాముఖ్యతను అర్ధం చేసుకునేలా పిల్లల్ని మార్చుకొండి.


భవిష్యత్తులో వారు కోరుకునే వస్తువుల కోసం డబ్బులు దాచుకునే విధంగా అలవాటు చేయడం మంచిది. ఆర్ధిక పరమైన విషయాలపై తెలివైన నిర్ణయాలు తీసుకునేలా పిల్లలకు మనమే తెలియజేయాలి.పిల్లలకి డబ్బును పొదుపు ఖర్చు వంటి కేటగిరీలు విభజించి చెప్పడం మంచిది. ఇంటి బడ్జెట్ గురించి కూడా పిల్లలకి చెప్పాలి. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వాలి. దాన్ని వారు ఎలా ఖర్చుపెట్టుకుంటున్నారో కూడా గమనించాలి. ఆర్ధిక నిర్ణయాలు ఇక్కడి నుంచే మొదలుపెట్టాలి.


పిల్లలకి తమ డబ్బును అవసరంలో ఉన్న వారితో పంచుకోవాలని బోధించాలి. ప్రేమ సానుభూతిని ఇది నేర్పిస్తుంది. తన పాకెట్ మనీ ని పక్కవారు కష్టాల్లో ఉంటే వాడడం కూడా నేర్పించాలి. అంతేకాదు ..దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆ డబ్బును వాడమని చెప్పాలి. అలాగే పిల్లలకి ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు మడత పెట్టడం వంటి పనులు కూడా చెప్తూ ఉండాలి వాళ్ల నిర్ణయం వాళ్ళు తీసుకునే విధంగా వారి పనులు వాళ్ళ చేసుకునే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. గుర్తుంచుకొండి..వారికి మీరు పునాది వేస్తున్నట్లే ...ఎంత విలువలు నేర్పిస్తే అంత స్ట్రాంగ్ గా ..క్లియర్ గా ఉంటారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kids parents money

Related Articles