న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండని వారెవరు.. చాలా వరకు ముక్క లేనిదే ముద్ద దిగదు అనే బ్యాచే. చికెన్ లవర్స్ సంఖ్య మరీ ఎక్కువైపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కు అంత డిమాండ్ ఉంటుంది. అప్పట్లో పండుగ పూటే చికెన్ మిగిలిన రోజుల్లో వెజ్ తో ఫుల్ గా తినేవారు. ఇప్పుడు ఆ రోజు ఈరోజు తేడా లేకుండా అన్ని రోజులు చికెనే. కాని చికెన్ ఏ రేంజ్ లో కల్తీ అవుతుందో మాత్రం తెలీదు.
హైదరాబాద్ లాంటి నగరంలో నిల్వ ఉంచిన.. కుళ్లిపోయిన చికెన్ ని విక్రయిస్తున్నారు. అసలు ఈ కుళ్లిపోయిన చికెన్ ను జనాలు ఎలా కొంటున్నారనే కదా మీ డౌట్ . దానికి వాసన రాకుండా ఎన్నో కెమికల్స్ కలుపుతున్నారు. ఇంతకీ ఎక్కడంటే బేగంపేట్ లో బాలయ్య చికెన్ సెంటర్ అనే పేరిట ఈ కుళ్లిన చికెన్ దందా చేస్తున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఈ కుళ్లిన చికెన్ దందా గురించి పక్కా సమాచారం అందింది. వాళ్లు మున్సిపల్ హెల్త్ అధికారులతో కలిసి ఈ దాడులు నిర్వహించారు. రూపాయికి కక్కుర్తి పడి నగరవాసుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీళ్ల పండారం బయట పడింది. దాదాపు 15 రోజుల వరకు నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ చికెన్ ను ముఖ్యంగా మందు షాపు వారికి అమ్ముతారు. కుళ్లిన చికెన్ ని కేజీ 30 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తారంట. బార్లు దగ్గర..కళ్లు ..కాంపౌండ్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ కు అమ్ముతున్నారు. ఈ చికెన్ తిని అనారోగ్యం పాలవుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నా... ఎవ్వరు పట్టించుకోరు.హైదరాబాద్ సహా.. ముంబయి, చెన్నై వంటి నగరాల నుంచి చికెన్ వేస్టేజ్ ని సేకరిస్తారు. ఆ తర్వాత దానిని బార్లు, కల్లు కాంపౌండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి విక్రయిస్తారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి గతంలో కూడా పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఈ మద్యం దుకాణాల దగ్గర ఈ చికెన్ అమ్ముతున్నారు. కాబట్టి బయట చికెన్ తినేటపుడు కాస్త ఆలోచించి తినండి.