Tamannah: బెట్టింగ్ యాప్ కేసులో మిల్కీ బ్యూటీ!

ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని లక్షల మంది ఎన్నో కష్టాలవుతున్నారు. అలాంటి ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రెటీస్ ప్రమోట్ చేస్తే ఆ ఇంపాక్ట్ కొన్ని వేల సంఖ్యలో జనాల మీద పడుతుంది. 


Published Oct 18, 2024 09:34:00 PM
postImages/2024-10-18/1729267519_tamannabhatiamahadevbettingapp114332990.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సెలబ్రెటీలు అన్నాక పలు బ్రాండ్ లని ప్రమోటం చేయడం చాలాకామన్. యూట్యూబర్స్ నుంచి అందరు కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. అందులోను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ నే జనాలు వదలడం లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని లక్షల మంది ఎన్నో కష్టాలవుతున్నారు. అలాంటి ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రెటీస్ ప్రమోట్ చేస్తే ఆ ఇంపాక్ట్ కొన్ని వేల సంఖ్యలో జనాల మీద పడుతుంది. 
ఇంతకు ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్‌ విషయంలో కొందరు ఫేమస్ సెలెబ్రెటీలు ఇలాగే చిక్కుకున్నారు.

ఈడీ విచారణలతో బాగా విసిగిపోయారు. ఇప్పుడు తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా వంతు వచ్చింది. చిన్నా చితక సెలబ్రెటీస్ అయిన వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వేరే విషయం ...కాని తమన్నా లాంటి వాళ్లు ప్రమోట్ చేస్తున్నారంటే ఏం చెప్తాం.. అందులోను డబ్బుకు మిల్కీ బ్యూటీకి ఏం తక్కువ.HPZ Token అనే బెట్టింగ్ యాప్ విషయంలో మిల్కీ బ్యూటీని ఈరోజు ఈడీ విచారించింది. బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల మైనింగ్ కోసం డబ్బు ఇన్వెస్ట్ చేయడం అనేది ఈ యాప్ కాన్సెప్ట్. ఇది ఓ రకమైన బెట్టింగ్ యాప్. ఈ యాప్ కి తమన్నా ప్రమోషన్స్ చేసింది. దీనికి సంబంధించి ఒక ఈవెంట్‌లో కూడా తమన్నా పాల్గొంది. ఫెయిర్‌ ప్లే బెట్టింగ్ యాప్‌లో IPL చూడాలని తమన్నా ప్రమోట్ చేసింది. ఇప్పుడు అదే ఆమెను ఈడీ ముందు ఉండేలా చేసింది. 


ఈ యాప్ ద్వారా కంపెనీ మోసాలకు, మనీ లాండరింగ్‌కు పాల్పడింది అంటూ దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, కొహిమా పోలీస్ స్టేషన్లలో కేసు రిజిస్టర్ అయ్యింది. దాదాపు 5 గంటల పైగా తమన్నాని విచారించారని సమాచారం. గౌహతీలోని ఈడీ ఆఫీసులో ఈ ఎంక్వైరీ జరిగింది. ఆమెను కేవలం HPZ టోకెన్ యాప్ వివరాలను అడగడానికి మాత్రమే పిలిపించామని ఈడీ తెలిపింది. అయితే ఎలా పడితే అలా...బెట్టింగ్ యాప్స్ ను వాడొద్దని అంటున్నారు నెటిజన్లు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu -police- mobile-app tamannaah

Related Articles