దానిమ్మ (pomagranate) అనేది తక్కువ కేలరీలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండు. అసలు చెప్పుకుంటూ పోతే ..ఒక్కటి కాదు అప్పుడు ఎప్పుడో చెప్పేవారు...యాపిల్ తింటే చాలు హెల్దీ అయిపోతారు అని ...కాని ఇప్పుడు కాదు ...ఇప్పుడు మాత్రం దానిమ్మ గింజలు తింటే చాలు ...సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు డాక్టర్లు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దానిమ్మ (pomagranate) అనేది తక్కువ కేలరీలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండు. అసలు చెప్పుకుంటూ పోతే ..ఒక్కటి కాదు అప్పుడు ఎప్పుడో చెప్పేవారు...యాపిల్ తింటే చాలు హెల్దీ అయిపోతారు అని ...కాని ఇప్పుడు కాదు ...ఇప్పుడు మాత్రం దానిమ్మ గింజలు తింటే చాలు ...సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు డాక్టర్లు.
దానిమ్మపండులో విటమిన్ సి( vitamin c) , కె, ఫోలేట్, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అది కూడా గింజలు తినడమే మంచిదట..శరీరానికి కావాల్సిన ఫైబర్ ( fiber) ఈ గింజలు అందిస్తారు. గుండె ( heart health) ఆరోగ్యానికి సహాయపడుతుంది. దానిమ్మ ఆర్థరైటిస్, కొన్ని క్యాన్సర్లతో సహా వివిధ వ్యాధులతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. దానిమ్మ గింజలు రోజు క్రమం తప్పకుండా తిని చూడండి. మీలో జరిగే మార్పు మీకే అర్దమవుతుంది.
ఇరానియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన దాని ప్రకారం దానిమ్మ...షుగర్( diabetic) కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు..మతిమరుపు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దానిమ్మ పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని, జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మ ఒక్కటి కాదు దానిమ్మ తొక్క , గింజలు అన్నీ మీ శరీరాన్ని బొట్టు బొట్టు క్లీన్ చేసేస్తుంది. ట్రస్ట్ మీ ...40 రోజులు రోజు దానిమ్మ గింజలు తింటే దాదాపు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.