UPI: కొత్త UPI మోసాలు.. చిన్న కాల్ తో డబ్బు దోచేస్తున్నారు జాగ్రత్త!

సైబర్ నేరాలతో మనం ఎప్పుడు జాగ్రత్త గానే ఉండాలి. ఎవరో తెలీకుండా పిన్ నెంబర్స్ కాని డీటైల్స్ కాని ఇవ్వకూడదు.


Published Sep 09, 2024 04:06:00 PM
postImages/2024-09-09/1725878221_Screenshot20240909153220.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  ఈ జీ మనీ కోసం కేటుగాళ్లు కాసుకొని కూర్చుంటున్నారు. ప్రతి ప్లాన్ కు వాళ్లదగ్గర వేరే ప్లాన్ రెడీగా ఉంది. సైబర్ నేరాలతో మనం ఎప్పుడు జాగ్రత్త గానే ఉండాలి. ఎవరో తెలీకుండా పిన్ నెంబర్స్ కాని డీటైల్స్ కాని ఇవ్వకూడదు.


యూపీఐ మోసాలతో ఇప్పటి వరకు రూ.4 కోట్లు కొల్లగొట్టిన రాజస్థాన్ సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీళ్లంతా హైదరాబాద్ లో ముఠాగా ఏర్పడి బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్ గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా  సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు. ఇకపోతే ఈ ముఠాలో మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని, పైగా ఒక్కొక్కరి దగ్గర రూ.1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.


మొదట ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు నగరంలో పలు షోరూంలోకి వెళ్తున్నారు. ఇక అక్కడ విలువైన వస్తువులు కొనుగోలు చేశాక, యూపీఐ ద్వారా అమౌంట్ పే   చేయడానికి బజాజ్ షోరూమ్ లో క్యూఆర్ కోడ్ ను వాళ్ల గ్యాంగ్ లో చాలా మందికి పంపుతూ ఆ అమౌంట్ ను రిటర్న్ తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే.. ఎలక్ట్రానిక్ వస్తువులు డెలివరీ అయ్యాక.. పొరపాటున వేరే ఖాతాకు ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ తెలివిగా బ్యాంకుకు ఆశ్రయిస్తున్నారు. అలా చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతూ మోసాలకు పాల్పడుతున్నారు. 


యూపీఐ నుంచి డబ్బు రిటర్న్ రాగానే ...కొన్న కొత్త వస్తువును అమ్మేసి డబ్బు చేసుకుంటున్నారు. ఇలా  గత రెండు నెలలుగా ఈ ముఠా  1,125 యూపీఐ ట్రాన్స్‌యాక్షన్స్‌  చేశారన్నారు. అయితే ఎంత జాగ్రత్త గా ఉన్నా..ఇలాంటి టెక్నికల్ మోసాలను ఆపలేకపోతున్నామంటున్నారు అధికారులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu upi payments money

Related Articles