దశ కంఠరావణునికి నవరాత్రులు అనగానే శ్రీలంక అనుకున్నారు కదా.. కాదు రావణ నవరాత్రులు మన భారత్ లోనే..మన పక్క రాష్ట్రంలో నే చేస్తారుEE
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దసరా నవరాత్రులు , వారాహి నవరాత్రులు , వినాయక నవరాత్రులు ఇలా నవరాత్రుల ఉత్సవాలు చాలా చూసి ఉంటాం. కాని దశ కంఠరావణునికి నవరాత్రులు అనగానే శ్రీలంక అనుకున్నారు కదా.. కాదు రావణ నవరాత్రులు మన భారత్ లోనే..మన పక్క రాష్ట్రంలో నే చేస్తారు.వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. పండల్‌లో రావణుడి విగ్రహానికి భక్తి శ్రద్దలతో పూజలు జరిపిస్తుంటారు గిరిజనులు. ఈ పూజ చేయని ఏడాది ఉండదు.
మధ్య ప్రదేశ్ లోని జమునియా గ్రామం నగరానికి కేవలం 16 కిలో మీటర్ల దూరంలో ట్యాంకీ మొహల్లాలో ఈ నవరాత్రులు జరుగుతాయి. నిజానికి ధూం ధామ్ గా జరుగుతాయి. ఇక్కడి గిరిజనులు నవరాత్రుల సందర్భంగా ఓ వైపు దుర్గామాత అమ్మావారిని ప్రతిష్టించి పూజలు జరుపుతూనే మరో వైపు రావణుడి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. దుర్గమ్మ కలశానికి ముందే రావణునికి కూడా కలశ స్థాపన చేస్తారు. తొమ్మిది రోజులు రావణునికి విగ్రహానికి కూడా అలానే నిమజ్జనం చేస్తారు.
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సానగోల ఊళ్లో కూడా దశకంఠుడికి నిలువెత్తు రూపాన్ని తయారు చేసి ప్రజలు హారతులు పడతారు. ఊరి మధ్యలో నల్లరాయితో చేసిన పెద్ద రావణుడి విగ్రహాం ఉంటుంది. ఈ పూజలు ఆయనలో మంచికి ...సీతమ్మను ఎత్తుకెళ్లడమనే తప్పు తప్ప మిగిలిన అన్ని పనుల్లోను రావణ బ్రహ్మ అంత మంచివాడు మరొకడు ఉండడు.300 ఏళ్లుగా గ్రామస్థులు దసరా రోజున రావణుడికి పూజలు చేయడం ఆచారంగా వస్తుంది. నిజానికి వాల్మీకి కూడా అరణ్యకాండ 32 వ సర్గలో వర్ణిస్తాడు. రావణుడు దయాగుణం. సంగీత బ్రహ్మ గొప్పవాడు. ఆ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కూడా రావణుడు నవరాత్రులు జరుపుకుంటారు.