Guinness Book: గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల అరుదైన జాతి ఎద్దు 2024-06-19 20:27:04

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికా ( AMERICA) లో ఓరెగావ్( OREGON)  రాష్ట్రంలో   ఉన్న జంతు సంరక్షణశాలలో ఓ అరుదైన  హోల్ స్టీన్ ( HOLESTEAN BREED )జాతి ఎద్దు గిన్నిస్ రికార్డు సాధించింది. ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు వరకు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. ఇప్పటివరకు టామీ( TOMMY)  అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తుతో రోమియా( ROMEIA)  ఈ రికార్డు క్రియేట్ చేసింది.


రోమియా ఎత్తు 6 అడుగుల పై మాటే..అంతేకాదు రోమియో ( ROMEO)చాలా సాఫ్ట్ ..రోజు దాని భోజనం కూడా యాపిల్స్ , అరటిపండ్లను ఇష్టంగా తింటుంది. రోజుకు 45 కేజీల గడ్డిని అలవోకగా లాంగించేస్తుందంటే నమ్మండి. ఇంత ఎత్తు ఇంత బరువు కారణంగా దీనిని స్పెషల్ వెహికల్స్ లో తరలిస్తున్నారు.


రోమియోను వధించేందుకు కొందరు కబేళాకు తరలించినప్పుడు దాని వయసు కేవలం 10 రోజులని.. ప్రస్తుతం బ్రతుకుపై ఆశకు చిహ్నంగా రోమియో జీవిస్తోందని చెప్పింది. అయితే దీని కారణంగానే తన భోజనానికి చాలా వరకు చందాలు విరాళాలు దండి రోమియా ను పోషిస్తున్నామని తెలిపారు.