AIR INDIA: ఎయిరిండియా ఫ్లైట్​కు 'ఎమర్జెన్సీ' ..టెన్షన్ టెన్షన్ లో అధికారులు !

తమిళనాడు తిరుచ్చి విమానాశ్రయాన్ని అలర్ట్ చేశారు. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లు చేయడం వల్ల, ఉత్కంఠ పరిస్థితుల మధ్య సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.


Published Oct 11, 2024 09:32:00 PM
postImages/2024-10-11/1728662585_44825222660944thumbnail16x9eoeoe.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించడంతో ప్రయాణికులు వారి కుటుంబాలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఫ్లైట్ బయలు దేరిన కాసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు వెంటనే తమిళనాడు తిరుచ్చి విమానాశ్రయాన్ని అలర్ట్ చేశారు. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లు చేయడం వల్ల, ఉత్కంఠ పరిస్థితుల మధ్య సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. పైలట్  జాగ్రత్త వల్ల ప్రయాణికులంతా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.


ఎయిరిండియా విమానం AXB 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం బయలుదేరింది.  బయలుదేరేటపుడు విమానం 141 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికి టెక్నికల్ ఇష్యూని పైలట్ గుర్తించారు.  ల్యాండింగ్ సేఫ్ గా జరుగుతుందో లేదో అని విమానం గాల్లో ఉండగానే ...20 అంబులెన్సులు ..డాక్టర్లను సిధ్ధంగా ఉంచమని చెప్పడం తో చాలా హై అలర్ట్ నడిచింది.


దాదాపు రెండు గంటల పాటు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. 20 అంబులెన్సులు, 20 అగ్నిమాపక యంత్రాలతోపాటు పారామెడికల్‌ సిబ్బందిని ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉంచారు. కాని చాలా జాగ్రత్తగా అత్యవసర ల్యాండింగ్ కు ఫ్లైట్ లో ఉన్న ఫ్యూయల్ తగ్గేలాగా గాల్లో అధిక మోతాదులో చక్కర్లు కొట్టించి ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు పైలట్ దీంతో ప్రయాణికులు 141 మంది ప్రాణాలతో బయటపడ్డారు.


దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు . "ఎయిరిండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిసి సంతోషంగా ఉంది. ప్రయాణికుల కుటుంబాలు టెన్షన్ పడాల్సిందేమి లేదు. పైలట్ తెలివిని అభినందిస్తున్నాను. 

newsline-whatsapp-channel
Tags : landing flight air-india tamilnadu take-off-landing-problems

Related Articles