Bolly wood:ఇండియాలో హైయెస్ట్ పారితోషకం అందుకుంటున్న బుల్లితెర నటి.!

సాధారణంగా సినీ ఫీల్డ్ లో ఎక్కువగా వెండితెర హీరో, హీరోయిన్లకు సంబంధించిన పారితోషకాలు ఎక్కువగా ఉంటాయి. బుల్లితెరలో నటించే చాలామంది  చాలా తక్కువ పారితోషకంతోనే నటిస్తూ


Published Aug 26, 2024 12:02:03 PM
postImages/2024-08-26/1724653923_hinakhan.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా సినీ ఫీల్డ్ లో ఎక్కువగా వెండితెర హీరో, హీరోయిన్లకు సంబంధించిన పారితోషకాలు ఎక్కువగా ఉంటాయి. బుల్లితెరలో నటించే చాలామంది  చాలా తక్కువ పారితోషకంతోనే నటిస్తూ ఉంటారు. దేశంలో ఈ బుల్లితెర నటికి మాత్రం లక్షల రూపాయల పారితోషకం ఉందట. ఒక పెద్ద హీరోయిన్ ఎంత సంపాదిస్తుందో అంత ఈమె పారితోషికంగా తీసుకుంటుందట. ఆమె ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.

బుల్లితెరపై ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి నటి హీనా ఖాన్.. ఈమె పేరు దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. 1987 అక్టోబర్ రెండవ తేదీన శ్రీనగర్ లోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన హీనా ఖాన్  లక్నపులోని సిఎంఎస్ మాంటిస్సోరీ పాఠశాలలో స్కూల్ విద్య పూర్తి చేసింది. ఇక ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె  "యే రిష్ట్యా క్యా కేహ్లాతా హై" అనే షోకు ఆడిషన్ కి వెళ్ళింది.

ఈ షోలో మెయిన్  క్యారెక్టర్ అయినటువంటి 'అక్షరా మహేశ్వరి సింఘానియా' కు ఎంపికయింది. 22 సంవత్సరాల వయసులోనే హీనా ఖాన్ టీవీ రంగంలో అడుగుపెట్టి  ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.  అలా బాలీవుడ్ సినిమా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ దూసుకుపోతోంది. ఇలా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీనా ఖాన్ నెలకు రూ:35 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

https://www.instagram.com/p/C9mb10sJ-5k/?igsh=MWl4b2Q2bzRtYnI0bQ==

రోజుకు ఒక టీవీ ఎపిసోడ్ కు లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు చార్జ్ చేస్తుందట. ఈ మధ్యకాలంలో ఆమె తన పారితోషికాన్ని రెండు లక్షలు కూడా పెంచినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు ఎంత పారితోషకం ఇవ్వడానికైనా దర్శక, నిర్మాతలు వెనకాడడం లేదట. ఎందుకంటే ఆమెకు బుల్లితెరపై అంత పేరు ఉంది. ఏదైనా సీరియల్ లేదా వెబ్ సిరీస్ లో నటిస్తుంది అంటే తప్పనిసరిగా అది హిట్ అవుతుందట. ఈ విధంగా ఇండియాలోని అత్యధిక పారితోషకం తీసుకునే బుల్లితెర నటిగా ఈమె రికార్డు సాధించింది. ప్రస్తుతం హీనాఖాన్ ఆస్తులు మొత్తం కలిపి 60 నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

newsline-whatsapp-channel
Tags : bollywood serial-artist remnuretion hina-khan highest-remnuretion-actor

Related Articles