తులం బంగారం పై రూ. 230 వరకు తగ్గింది.24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.77,440గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.70,099గా ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహిళలకు గోల్డెన్ ఛాన్స్ . బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత నెల దాదాపు గ్రాము మీద 1500 పెరిగింది. ఇప్పుడిప్పుడు మళ్లీ తగ్గుతుంది. మంగళవారం తులం బంగారం పై రూ. 230 వరకు తగ్గింది.24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.77,440గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.70,099గా ఉంది.
దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోను ఇదే ధర నడుస్తుంది. ముంబై లో 22 క్యారట్ల బంగారం గ్రాము బంగారం 7 వేల రూపాయిలు నడుస్తుంది. 24 క్యారట్ల బంగారం గ్రాము బంగారం 7700 నడుస్తుంది. మార్కట్లో అసలు ధర ఇది దీని పై జీఎస్టీలు, షో రూమ్ ఛార్జెస్ అన్నీ కలిపి వేరేలా ఉంటుంది. సో చూసుకొని తీసుకొండి.
గడిచిన రెండు రోజులుగా వెండి ధరల్లోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా రెండు వేలకుపైగా పెరిగిన వెండి ధరలు.. మంగళవారం మరోసారి స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి రూ. 96,800గా ఉంది. ముంబై, పూణేలలో కిలో వెండి రూ. 96,800గా.. ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ. 96,900గా.. చెన్నై, హైదరాబాద్, కేరళ నగరాల్లో కిలో వెండి రూ. 1,02, 900గా ఉంది.