నిజంగా ఫేమ్ కావాలంటే అన్నింటిని 100 శాతం బ్యాలెన్స్ చేయగలిగినపుడే ఇలాంటి వాటి మోజులో పడాలి. ఇవి ఎలా అర్ధమవుతుందో కొందరికి .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రీల్స్ మోజు లో పడి ఓ తల్లి బిడ్డను గంగలో మరిచిపోయింది. వింటుంటేనే మనసు చలించిపోతుంది. ఏం పట్టుకుంది వీరికి ....సోషల్ మీడియా భూతం పట్టుకుంది. తల్లి , పిల్లలు, మొగుడు , సంసారం ఇవేం పట్టించుకోకుండా ..ఫేమ్ కోసం పాకులాడుతున్నారు. నిజంగా ఫేమ్ కావాలంటే అన్నింటిని 100 శాతం బ్యాలెన్స్ చేయగలిగినపుడే ఇలాంటి వాటి మోజులో పడాలి. ఇవి ఎలా అర్ధమవుతుందో కొందరికి .
కార్తీక సోమవారం పురస్కరించుకుని గంగా నదిలో పుణ్య స్నానాలకు వెళ్లిన తల్లి ...రీల్స్ చేస్తూ తన కూతురు నీళ్లలో ఉన్న సంగతి మరిచిపోయింది. దీంతో ఆ చిన్నారి గంగానదిలో కొట్టుకుపోయి రెండు గంటల తర్వాత చిన్నారి చనిపోయి ..శవంగా తేలింది. ఉత్తరప్రదేశ్లో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని చౌబేపూర్ ప్రాంతంలోని ఉమర్హా గ్రామానికి చెందిన అంకిత అనే వివాహిత తన ఐదేళ్ల కుమార్తె తాన్యతో కలిసి సైద్పూర్లోని బౌర్వాన్ గ్రామంలోని తన పుట్టింటికి వచ్చింది. కార్తీక సోమవారం ఛత్ పూజ జరుపుకోవడానికి అమ్మగారింటికి వచ్చింది. అక్కడ పుణ్యస్నానాల కోసం గంగానదికి చేరి ...సరదాగా ఆడుతూ ...పిల్లను మరిచిపోయింది. తన చెల్లెలు తీస్తున్న రీల్స్ పై ఫోకస్ చేసింది. పిల్ల నీళ్లు మింగి కొట్టుకుపోతున్నా చూసుకోలేదు. దీంతో చిన్నారి చనిపోయింది. ఈ దృశ్యాలు కూడా స్మృతి రికార్డు చేస్తున్న వీడియోలో ఉన్నాయి.
गाजीपुर में 4 साल की बच्ची परिवार वालों के सामने ही डूब गई, मौसी मोबाइल में रील बनाती रही, आप ऐसी मौसी को क्या कहा जाए जो रियल बनाने में केवल लगी हुई थी और एक मासूम बच्ची डूब गई। @ghazipurpolice @Uppolice pic.twitter.com/gHcNdOgcG6 — Atul Kumar Yadav
Tags : newslinetelugu reels child socialmedia mother uttrapradesh died