Nasa: భూమ్మీద ఇదే చిట్టచివరి దీవి..మనుషులు కూడా ఉన్నారండోయ్ !

ఆ ప్రాంతమే ‘ట్రిస్టాన్ డ కున్హా’. ప్రపంచంలో మనుషులు నివసించే ప్రాంతాల్లో అత్యంత దూరంగా ఉన్న దీవి ఇదే.  ఈ ఐలాండ్ అటు దక్షిణ అమెరికా ఖండానికి, ఇటు ఆఫ్రికా ఖండానికి దాదాపు మధ్యలో ఉండే దీవి ‘ట్రిస్టాన్ డ కున్హా’. ఇది బ్రిటన్ దేశం అధీనంలో ఉంది. ఇక్కడున్న ఒకే ఒక్క టౌన్ పేరు ‘ఎడిన్ బర్గ్ ఆఫ్ సెవెన్ సీస్’. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ల్యాండ్‌శాట్‌ ఉపగ్రహం ఇటీవల ఈ దీవిని ఫొటో తీసింది. నా సా తమ ‘నాసాఎర్త్’ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో ఈ ఫొటోను పోస్ట్‌ చేసింది. 

Published Jul 07, 2024 11:40:00 AM
postImages/2024-07-07/1720332706_ISS034E041528lrg.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : సపోజ్ ...ఫర్ సపోజ్ ...మీరు ఏ సముద్రంలోనో మునిగిపోయి...ఓ దీవికి కొట్టుకుపోతే...మీరు మాత్రమే మనుషులు..మరో మనిషి లేదనిపిస్తే ...సగం ప్రాణం అక్కడే పోతుంది. మీకు ఎప్పుడైనా ...భూమ్మీద మరో మనిషిని చూడకుండా దూరంగా ఎటైనా పోవాలనిపిస్తే..ఈ ప్లేస్ ట్రై చేద్దాం. ఇంతకీ ఏ ప్లేస్ అంటారా.. ఈ మధ్యే నాసా ఓ ద్వీపం పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఆ ప్రాంతమే ‘ట్రిస్టాన్ డ కున్హా’. ప్రపంచంలో మనుషులు నివసించే ప్రాంతాల్లో అత్యంత దూరంగా ఉన్న దీవి ఇదే.  ఈ ఐలాండ్ అటు దక్షిణ అమెరికా ఖండానికి, ఇటు ఆఫ్రికా ఖండానికి దాదాపు మధ్యలో ఉండే దీవి ‘ట్రిస్టాన్ డ కున్హా’. ఇది బ్రిటన్ దేశం అధీనంలో ఉంది. ఇక్కడున్న ఒకే ఒక్క టౌన్ పేరు ‘ఎడిన్ బర్గ్ ఆఫ్ సెవెన్ సీస్’. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ల్యాండ్‌శాట్‌ ఉపగ్రహం ఇటీవల ఈ దీవిని ఫొటో తీసింది. నా సా తమ ‘నాసాఎర్త్’ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో ఈ ఫొటోను పోస్ట్‌ చేసింది. 

207 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ ఐలాండ్ ‘ట్రిస్టాన్ డ కున్హా’ దీవిలో చాలా భాగం పెద్ద పర్వతమే. దాని శిఖరం కూడా మంచుతో కప్పి ఉంటుంది. మిగతా దీవి అంతా దట్టమైన అడవులతో పచ్చదనం నిండి ఉంటుంది.  అయితే ఇక్కడ మనుషులు లేరని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఇక్కడ జనాభా 300 మంది కంటే తక్కువే. అంతా బ్రిటన్ సంతతి వారే నివసిస్తూ ఉంటారు. ఈ ట్రైబ్స్ మాత్రమే ఈ దీవిలో బతుకుతున్నారు. అంతేకాదు ఈ దీవి ప్రపంచంలోనే అత్యంత ఒంటరి దీవి. ఇంకా చెప్పాలంటే ఆ దీవి వారికి బయట ప్రపంచంలో జనాలు ఉన్నారని తెలిసినా ...మనుషులు ఇలా ఉంటారని కూడా తెలీదంటే ఆలోచించండి.
 
newsline-whatsapp-channel
Tags : newslinetelugu nasa iland sea social-media

Related Articles