rasam: సీజనల్ గా దొరికే ..ఉసిరికాయ రసం ..ఈజీగా చేసెయ్యొచ్చు !

ఈ కాలంలో సిట్రస్ ఫుడ్స్ హెల్త్ కి చాలా మంచిది. ఈ ఉసిరి ముఖ్యంగా జుట్టు హెల్త్ కి చాలా మంచిది.


Published Dec 30, 2024 03:49:31 AM
postImages/2024-12-30/1735551439_113621635.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇప్పుడు అంతా ఉసిరికాయల సీజన్. అసలు ఈ కాలంలో సిట్రస్ ఫుడ్స్ హెల్త్ కి చాలా మంచిది. ఈ ఉసిరి ముఖ్యంగా జుట్టు హెల్త్ కి చాలా మంచిది. ఉసిరికాయలతో పప్పు, ఇన్​స్టంట్​ పచ్చడి, రైస్​ కూడా చేసుకోవచ్చు. అలాగే ఘాటైన రసం కూడా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ ఉసిరి రసం తింటే బాగుంటుంది. కాసింత ఘాటుగా చేసుకుంటే మరీ మంచిది. చిన్నపిల్లలకి అయితే మంచి ఇమ్యూనిటీ. 
కావాల్సిన పదార్థాలు:

ఉసిరికాయలు - 4(నిమ్మకాయ సైజ్​)
మిరియాలు - 1 టీ స్పూన్​
జీలకర్ర - 1 టీ స్పూన్​
బాగా పండిన మీడియం సైజ్​ టమాటలు - 2
నూనె - 1 టేబుల్​ స్పూన్​
ఆవాలు - 1 టీ స్పూన్​
జీలకర్ర - అర టీ స్పూన్​
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 2 రెబ్బలు
ఎండు మిర్చి - 2
అల్లం తరుగు - 1 టీ స్పూన్​
పచ్చిమిర్చి - 1
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర టీ స్పూన్​
నీరు - ఒకటింపావు లీటర్లు
కందిపప్పు పేస్ట్​ - పావు కప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
ముందుగా కందిపప్పు ఉడికించి ..మెత్తగా చేసి ఉంచుకొండి. ఉసిరి కాయలు ముక్కలు కట్ చేసి ఉంచుకొండి. పిక్కలు తీసేయండి. దీనితో పాటు కాసింత పచ్చిమిర్చి , అల్లం సన్నగా తరగి ఉంచుకొండి. పులుపు కోసం టమోటా తీసుకొండి .వీటిలో కాసింత జీలకర్ర వేసి వీటన్నింటిని మెత్తగా పేస్ట్ చెయ్యండి.


ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్​ పెట్టి అందులోకి నూనె పోసి వేడి చేసుకోవాలి. పోపు వేసుకొండి.  అందులోకి తరిగిన అల్లం, పచ్చిమిర్చి చీలికలు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.


ఆ తర్వాత గ్రైండ్​ చేసుకున్న ఉసిరికాయ టమాట మిశ్రమం వేసి కలుపుకోవాలి. అనంతరం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఒకటింపావు నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్​ను మీడియం ఫ్లేమ్​ మీద పెట్టి చారు ఓ పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. సుమారు ఓ 10 నిమిషాల టైమ్​ పడుతుంది. ఇందులో మీరు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ లాగా కందిపప్పు వేసి మరో మూడు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత కొద్ది గా కొత్తిమేర వేసి దించేసుకొండి.  ఇది ఇమ్యూనిటీ తో పాటు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : health-benifits life-style healthy-food-habits

Related Articles