దీని పై రీసెంట్ గా మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాట్లాడారు. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదని… ఇదంతా మోసగాళ్ల పనేనని ఆయన తెలిపారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: డిజిటల్ అరెస్ట్ సామాన్యులకు వణికిస్తున్న కొత్తభయం . అసలు కొంతమందికి డిజిటల్ అరెస్ట్ ఏంటో కూడా అర్ధం కాలేదు. కొంతకాలం క్రితం ఆగ్రాకి చెందిన ఓ మహిళా హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఎందుకంటే ..తన కూతురు వ్యభిచారం చేస్తూ దొరికిందని ఇప్పుడు జైల్లో ఉందని తమకు కావాల్సిన డబ్బు పంపిస్తే వదిలేస్తామని పోలీసు వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. తనతల్లి అది విని గుండె పోటుతో చనిపోయింది.
దీని పై రీసెంట్ గా మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాట్లాడారు. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదని… ఇదంతా మోసగాళ్ల పనేనని ఆయన తెలిపారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్లు మీ పర్సనల్ డీటైల్స్ ను వీడియో కాల్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా అడగరు. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ విషయంలో మరింత జాగ్రత్తు తీసుకుంటామని తెలిపారు.
అసలు డిజిటల్ అరెస్ట్ అంటే.. కొంతమంది మోసగాళ్లు పోలీస్, ఇన్కమ్ టాక్స్, సిబిఐ ఆఫీసర్స్ అంటూ కాల్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని రాబడుతున్నారు. వీడియో కాల్స్ చేసి మీపై కేసులు పెట్టామంటూ బెదిరించి లక్షల రూపాయలు లాగేసుకుంటున్నారు. మీకు ఇలాంటి కాల్స్ వస్తే భయపడకుండా పోలీసులకు కంప్లెయింట్ చెయ్యండి. వీడియో కాల్స్ లో బ్యాగ్రౌండ్ లో సెటప్ చేసుకొని అవి వీడియోకాల్ లో కనిపించేలా మాట్లాడతారు. ఇక కొన్నిసార్లు డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ అరెస్టు వారెంట్లను కూడా చూపించి బెంబేలెత్తిస్తున్నారు.ఇలాంటి కేసుల్లో ఈ మధ్యకాలంలో చాలామంది మోసపోయారు. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని తెలుసుకోవాలి. ఈ పేరుతో మీకు ఎవరైనా కాల్ చేస్తే భయపడకండి. వెంటనే పోలీసులకు కంప్లెయింట్ చెయ్యండి.