Marriage:పెళ్లయిన స్త్రీ కాళ్లకు మెట్టెలు ఎందుకు ధరిస్తుందంటే.?

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన స్త్రీలు తప్పనిసరిగా నుదుట బొట్టు, కాళ్ళకు మెట్టెలు, మెడలో తాళిబొట్టు ధరించాలి.ఇవి ఉన్నాయంటే ఆ అమ్మాయికి పెళ్లి అయినట్టే లెక్క. ఇందులో కాళ్ళకి మెట్టెలు ఎందుకు ధరిస్తారు? దీనివల్ల జరిగే లాభాలు ఏంటి అనే వివరాలు చూద్దాం.? సాధారణంగా వివాహమైన ప్రతి స్త్రీ వెండి లేదా బంగారు మెట్టలను ధరిస్తూ ఉంటారు. మెట్టెలు ధరించడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఉపయోగాలు ఉంటాయట.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721107151_mettelu.jpg

న్యూస్ లైన్ డెస్క్: హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన స్త్రీలు తప్పనిసరిగా నుదుట బొట్టు, కాళ్ళకు మెట్టెలు, మెడలో తాళిబొట్టు ధరించాలి.ఇవి ఉన్నాయంటే ఆ అమ్మాయికి పెళ్లి అయినట్టే లెక్క. ఇందులో కాళ్ళకి మెట్టెలు ఎందుకు ధరిస్తారు? దీనివల్ల జరిగే లాభాలు ఏంటి అనే వివరాలు చూద్దాం.? సాధారణంగా వివాహమైన ప్రతి స్త్రీ వెండి లేదా బంగారు మెట్టలను ధరిస్తూ ఉంటారు. మెట్టెలు ధరించడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఉపయోగాలు ఉంటాయట.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం  కాలి బొటనవేలు పక్కన ఉండే,  వేలుతో స్త్రీ యొక్క గర్భాశయానికి లింక్ ఉంటుందట. అందుకే మెట్టెలను ఈ వేలికి ధరించడం వలన,  గర్భాశయ సమస్యలు రాకుండా ఉంటారట. దీనివల్ల తొందరగా సంతాన సాఫల్యం కలుగుతుందట. పెళ్లి కాకుండా గర్భాశయంతో సంబంధాలు ఉండవు కాబట్టి, పెళ్లయిన స్త్రీలు మాత్రమే మెట్టెలను ధరిస్తారు. అంతేకాకుండా మెట్టెలను వెండి లేదా బంగారంతో చేసినవి మాత్రమే వాడడం వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయి.

ఇవి అత్యుత్తమ విద్యుత్ వాహకాలు. భూమిలో నుంచి శక్తిని రిసీవ్ చేసుకుని శరీరానికి అందిస్తాయి. దీంతో చేయడం వ్యవస్థ యాక్టివ్ అయి ఆరోగ్యంగా ఉంటారు.అంతే కాకుండా ఇవి బాడీలో ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా బయటకు పంపిస్తాయి.  మెట్టెలు ఆక్టివ్ ప్రెజర్ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే నరాలపైన  ప్రభావం చూపి మహిళల్లో తొందరగా సంతాన సాఫల్యం కలిగేలా చేస్తాయట. అలాగే లైంగిక సామర్థ్యం కూడా పెంచుతాయట . అంతేకాకుండా మెట్టలు ధరించడం వల్ల రక్తప్రసరణ కూడా అద్భుతంగా జరుగుతుందని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marriage health-benifits mettelu

Related Articles