New Delhi: ఓరే బాబు..మీరు ఆఫీసులకు రావద్దు ...వర్క్ ఫ్రం హోమ్ చెయ్యండి !

కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 


Published Nov 20, 2024 11:25:00 AM
postImages/2024-11-20/1732082152_DelhiNCRAirpollution.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఢిల్లీ లో వాయుకాలుష్యం తారస్థాయికి చేరుకోవడంతో అక్కడి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉద్యోగులకు కీలక సూచన చేసింది. ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పనిచెయ్యాలంటు  ప్రభుత్వం ఆదేశించింది. ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే దాదాపు 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఆదేశించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 


కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 422గా నమోదైంది. ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితి. ఒక్క రోజు ఢిల్లీ వాతావరణంలో ఉంటే ...49 సిగరెట్లు తాగినట్టే. చాలా ఆఫీసులు టైమింగ్స్ ను ఛేంజ్ చేశాయి.


ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కింద పనిచేసే కార్యాలయాలు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వం కింద పనిచేసే కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేసేలా సవరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. వాయుకాలుష్యం కారణం గా ఢిల్లీ కాలుష్యం రోజు రోజుకు మారుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pollution delhi

Related Articles