WARNING: ఇక పై రైల్వే ట్రాక్ పై రీల్స్ చేస్తే ...తోలు తీసేస్తారు జాగ్రత్త !

రైల్వే ట్రాక్స్ పై ...రీల్స్ చేసే వారిని ఇక పై పోలీసులు ఊరుకోరు. లాఠీలతో బుధ్దిచెప్పి ..కాళ్లు చేతులు విరగొట్టేస్తారు.


Published Nov 17, 2024 01:56:00 PM
postImages/2024-11-17/1731832085_railwaytrack.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ సోషల్ మీడియా వచ్చాక ...జనాలు మెంటల్ అయిపోతున్నారు. ఫేమ్ కావాలి ఎలా అనేది తెలీదు..ఎలాగైనా బోలెడు ఫేమస్ అయిపోవాలి. అందుకే రైళ్లు ... రైల్వే స్టేషన్లు...నుయ్యి , గొయ్యి తేడా లేకుండా రీల్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ తల్లి తన మూడేళ్ల కూతుర్ని నదిలో స్నానానికి తీసుకు వచ్చి ..ఆడిస్తుంది. పాప ను మరిచిపోయి రీల్స్ చేసుకుంటూ ఉంది. దీంతో పాప నదిలో కొట్టుకుపోయి చనిపోయింది. ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి లేదు. అదీ కాక కొన్ని వందల మంది రైల్వే ట్రాక్ పై ..రీల్స్ చేస్తూ ...రైలు ప్రమాదాలకు గురవుతున్నారు. వాళ్లు చేసే పనికి లక్షల మంది జనాలు ప్రమాదం లో పడుతున్నారు. అలా రైల్వే ట్రాక్స్ పై ...రీల్స్ చేసే వారిని ఇక పై పోలీసులు ఊరుకోరు. లాఠీలతో బుధ్దిచెప్పి ..కాళ్లు చేతులు విరగొట్టేస్తారు.


అయితే రీసెంట్ గా  జరిగిన జైపూర్‌లో రైలు పట్టాలపై కారు నడిపి ప్రమాదం లేటెస్ట్ ఉదాహరణ మాత్రమే. జై పూర్ లో ఓ వ్యక్తి మద్యం తాగి తన మహీంద్రా థార్ కారును రైల్వే ట్రాక్ పై నడిపాడు. ఈ రీల్ తీసే క్రమంలో కారు ట్రాక్ పై ఇరుక్కుపోయింది. ఒక వైపు గూడ్స్ ట్రైన్ కూడా రావడంతో ...లోకో పైలట్ చూసి ట్రైన్ ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే భారీ ప్రమాదం జరగడంతో పాటు రైల్వే వారికి కొన్ని లక్షల ఆస్థ్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం జరిగేది. అయితే ట్రాక్స్ పై రీల్స్ చేసినందుకు గాను అతనిని అరెస్ట్ చేసి కారు సీజ్ చేశారు.


 రైల్వే ట్రాక్‌లు , రైల్వే డిపార్ట్ మెంట్ కి చెందిన ఏ ప్లేస్ లో అయినా రీల్స్, స్టంట్స్ చేస్తే అటువంటి వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని రైల్వే బోర్డు అధికారులను ఆదేశించింది. ఏ మాత్రం  ట్రాక్స్ పై రీల్స్ చేస్తూ కనిపించినా వెంటనే ఎఫ్ ఐ ఆర్ తో పాటు ...వారికి బుధ్ధి చెప్పే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులను రైల్వే బోర్డు ఆదేశించింది.  

newsline-whatsapp-channel
Tags : newslinetelugu train reels railway-department railway-track-damaged

Related Articles