CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ 2024-06-24 13:14:14

న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు పూర్తి స్థాయి బెయిల్‌ను మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం కోసం మధ్యలో మార్చి 10 నుంచి జూన్ 1 వరకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎన్నిక ముగిశాక కేజ్రీవాల్ లొంగిపోయారు. లోక్‌సభ ఎన్నికల ముందు 15 రోజుల తాత్కాలిక బెయిల్ మంజారు చేసిన విషయం తెలిసిందే. మార్చి 21న లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.