Anakapalle: రియాక్టర్‌ పేలుడు ఘటనపై స్పందించిన జగన్

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు


Published Aug 21, 2024 09:14:16 PM
postImages/2024-08-21/1724255056_jaganan.PNG

న్యూస్ లైన్ డెస్క్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పేలుడు కారణంగా పలువురు మరణించడంపై వైఎస్ జగన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని కోరారు. తమ పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని, మళ్లీ ఇలాంటివి జరక్కుండా గట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana chandrababu andhrapradesh fire-accident jagan police

Related Articles