పేరెంట్స్ మాత్రం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని కుంద్రత్తూర్లో జరిగింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు ఇంట్లో బొద్దింకలు, ఎలుకలు , చెదలు కోసం ప్రైవేట్ పెస్టిసైడ్స్ వారిని కలుస్తున్నారు. అయితే వారు మోతాదుకి మించి కెమికల్స్ వాడడం తో ఓ నిండు కుటుంబం ప్రాణాలతో పోరాడుతున్నారు. పిల్లలు ఇద్దరు చనిపోయారు. పేరెంట్స్ మాత్రం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని కుంద్రత్తూర్లో జరిగింది.
గిరిధరన్(36), పవిత్ర(31) కుద్రత్తూర్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వైష్ణవి(6), సాయి సుదర్శన్(1) ఉన్నారు. చాలా రోజులుగా ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ అవడం వల్ల- ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఒక ప్రైవేటు పెస్ట్ కంట్రోల్ కంపెనీకి అప్పగించారు. వారు రెండు మూడు రోజుల్లో ఈ ఎలుకల బాధను తగ్గిస్తామని ..మళ్లీ తిరిగి రావని చెప్పడంతో వారికి ఆ పనిని అప్పగించారు.
అయితే ఎలుకలను తరమికొట్టడానికి మోతాదు కంటే ఎక్కువగా కెమికల్స్ వాడారు. కెమికల్ ఇల్లంతా వ్యాపించింది. నిజానికి ఈ కెమికల్స్ వాడిన రెండు మూడు రోజులు ఇంట్లో ఉండకూడదు. కాని వారు అలాంటిదేం అవసరం లేదని చెప్పడంతో దాన్ని పీల్చిన చిన్నారులు ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం గిరిధరన్, పవిత్ర ప్రాణాలతో పోరాడుతున్నారు. ఘటనాస్థలిని సందర్శించిన తాంబరం ఫోరెన్సిక్ సైన్స్ ఇన్స్టిట్యూట్ నిపుణులు, ప్రైవేటు కంపెనీ ఉపయోగించిన పెస్టిసైడ్స్ శాంపిళ్లను సేకరించారు. దీంతో ఇంట్లో ఆ కెమికల్స్ వాడిన వారు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.