ఏఐ బేస్డ్ మెషిన్ లెర్నింగ్ చాట్ బాట్ ..చాట్ జీపీటి పెద్ద మొత్తంలో డేటా, కంప్యూటింగ్ టెక్నాలజీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓపెన్ ఏఐ తీసుకొచ్చినన ఏఐ ఆధారిత చాట్ జీపీటీ లో పెద్ద సమస్యలో చిక్కుకుంది. మైక్రోసాఫ్ట్ మధ్ధతుగల కంపెనీ ఈ ప్రసిధ్ధ చాట్ జీపీటీ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ విషయం కంపెనీని అనౌన్స్ చేసింది. ఏవో సాంకేతిక సమస్యల్లో కంపెనీ చిక్కుకుందని పనిచేయడం లేదని తెలిపింది. దీంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో దాదాపు 20,000 మంది వినియోగదారులకు చాట్‌జీపీటీలో సమస్య కారణంగా ఆటంకం ఏర్పడింది. అయితే వినియోగదారులకు కావాల్సిన సమాచారాన్ని సెకన్స్ లో అందిస్తుంది.
అయితే ఇది శనివారం వినియోగదారులను ఇబ్బంది పెట్టింది. పనిచేయకుండా ఆగిపోవడంతో అనేక మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నారు. ఏఐ బేస్డ్ మెషిన్ లెర్నింగ్ చాట్ బాట్ ..చాట్ జీపీటి పెద్ద మొత్తంలో డేటా, కంప్యూటింగ్ టెక్నాలజీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తాయి. పదజాలాన్ని ఉపయోగించడమే కాకుండా, పదాలను సరైన సందర్భంలో ఉపయోగిస్తుంది కూడా. చిన్న హింట్ ఇస్తే స్టోరీ రాసేస్తుంది. ఇప్పుడు ఎన్నో వేల మంది జీపీటీ వాడుతున్నారు. సడన్ గా ఆగిపోవడంతో చాలా ఇబ్బందిపడ్డారు.