IIT Bombay: రామున్ని కించపరిచిన ఐఐటీ విద్యార్ధులు ..1.5 లక్షలు ఫైన్ వేసిన కాలేజీ..! 2024-06-20 21:32:47

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ముంబైలోని (mumbai iit) స్టూడెంట్స్ రామాయణనాటకాన్ని కించపరిచే ఆలోచనలతో రామాయణ నాటకం వేశారట. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై వేటు వేసింది. ఈ క్రమంలో ఎనిమిది మంది విద్యార్థులకు జ‌రిమానా విధించారు. వీరిలో న‌లుగురికి రూ. 1.20 లక్షల చొప్పున‌ జరిమానా విధించ‌గా, జూనియ‌ర్లు అయిన మ‌రో న‌లుగురికి రూ. 40వేల చొప్పున ఫైన్ వేశారు. జూనియర్లు ...కాలేజీ వదిలి వెళ్లిపోవాలని ఆదేశించిందట.. 


మహారాష్ట్ర రాజధాని ముంబైలో( mumbai )  ఉన్న ఐఐటీ బాంబేలో మార్చి 31న కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఆ సమయంలో రామాయణం ఆధారంగా 'రాహోవన్'( raahovan)  నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో స్త్రీవాద సమస్యల పేరుతో రాముడి పాత్రను తారుమారు చేసి పాత్రల పేర్లలో మార్పులు చేశారు. దీంతో వెంటనే కొంతమంది పిల్లలు ఈ నాటకాన్ని ఆపేశారు.


ఈ నెల  4న నోటీసు ఇచ్చింది. 1.20 లక్షల జరిమానాను జులై 20, 2024న డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ కార్యాలయంలో డిపాజిట్ చేయాలని నోటీసులో పేర్కొన‌డం జ‌రిగింది. ఓ విద్యార్థికి ఒక సెమిస్టర్‌ ఫీజుతో సమానమైన జరిమానా విధించడం పట్ల విమర్శ‌లు చేస్తున్నారు. అయినా మరో సారి విద్యార్దులు ఇలా చేయడానికి భయపడాలని అంటున్నారు కాలేజీ యాజమాన్యం .