Uttar Pradesh: ఓరే....ఏంటి రా ఇది ...ప్రేమిస్తే చెప్పాలి కాని లింగమార్పిడి చేయించేస్తారా ! 2024-06-20 22:01:40

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేవుడా ...ఒక్కో వార్త వింటుంటే భయమేస్తుంది. ఏంటి ఇలాంటి మనుషులున్నారని వెన్ను వణికిపోతుంది. ఇప్పుడు చెప్పే వార్త చూస్తే ఇలానే అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనతో ఇక ఫ్రెండ్ ( friend) అంటే భయమేస్తుంది. ఓ ఏరియా ఇద్దరి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ యువకుడిపై మోజు పడిన వ్యక్తి... ఆ యువకుడికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించేశాడు. షాక్ అయ్యారా ...అదే ట్విస్ట్ . అసలు మ్యాటర్ ఏంటంటే..


ముజఫర్ నగర్( MUJFAR NAGAR)  కు చెందిన 20 ఏళ్ల ముజాహిద్( MUJAHID)  అనే యువకుడు... ఓం ప్రకాశ్( OM PRAKASH)  అనే వ్యక్తితో రెండేళ్లుగా ఫ్రెండ్స్ . చాలా క్లోజ్ గా తిరిగేవారు.  రీసెంట్ గా ముజాహిద్ కు హెల్త్ బాగా లేదు... తాను ఆసుపత్రికి తీసుకెళతానంటూ ఓం ప్రకాశ్ ఆ యువకుడిని మన్సూర్ పూర్( MANSURPUR)  లోని ఓ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు ముజాహిద్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఓ శస్త్రచికిత్స చేయాలని సూచించారు. నిజమేనని నమ్మిన యువకుడు శస్త్రచికిత్సకు సిద్ధమయ్యాడు. 


అయితే, వైద్యులు ముజాహిద్ కు లింగ మార్పిడి( ORAGANS)  చేశారు. మత్తుమందు కారణంగా తనకు ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించారో ఆ యువకుడు గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత ఓం ప్రకాశ్ వచ్చి... ఇప్పుడు నువ్వు అమ్మాయిగా మారిపోయావు... నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను... జీవితాంతం మనం కలిసే ఉండొచ్చు అని చెప్పాడు.  దీంతో ముజాహిద్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఓ గంట అర్ధం కాలేదు. తేరుకున్నాక తన పేరెంట్స్ కు విషయాన్ని చెప్పాడు.బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఓం ప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. పెళ్లికి ఒప్పుకోకపోతే తన తండ్రిని చంపేస్తానంటూ ఓం ప్రకాశ్ బెదిరించాడని, తమ భూమిని కూడా లాక్కున్నాడని బాధిత యువకుడు ఆరోపించాడు. 


ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. నిందితుడు ఓం ప్రకాశ్ తో పాటు, లింగ మార్పిడి చేసిన బేగ్ రాజ్ పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి డాక్టర్లను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత వ్యక్తి కోట్లు పరిహారం చెల్లించాలని కిసాన్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.