kids: 90's కిడ్స్ కి ...మరిచిపోలేని గుర్తు ...ఫోన్ బూత్ 2024-06-19 15:12:31

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రోజులు చాలా ఫాస్ట్ గా వెళ్లిపోతున్నాయి. నిన్న , మొన్న జరిగినవే గుర్తుండడం లేదు. ఓ జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. పిల్లలు , చదువులు , హడావిడి కంగారు జీవితం ..కాసేపు పదేళ్ల క్రితం విషయాలే  మాట్లాడుకుందాం రండి. . కాసేపు కొన్ని సిల్లీ , సీరియస్ విషయాలు మాట్లాడుకుందాం రండి. 


గుర్తుందా ..వీధి చివర ఎస్టీడీ బూత్...నిమిషం మాట్లాడితే నాలుగు ఐదు రూపాయిలు తీసుకునేవాడు. అత్యవసరం అయితే తప్ప ఫోన్ దగ్గరకే వెళ్లేవాళ్లం కాదు. అప్పుడు మాట్లాడడానికి బోలేడు విషయాలుండేవి...టైం కౌంట్ కాబట్టి ఫాస్ట్ గా మాట్లాడి పెట్టేసేవారు. ఇప్పుడు బోలెడు టైం ఉంది..విషయాలే లేవు. కదా..కాని ప్రతి వీధికి ఇలాంటి ఓ ఫోన్ బూత్ ...ఓ అమ్మాయి కోసం వెయిట్ చేసే రొమియో ఖచ్చితంగా ఉండే ఉంటారు.


అసలు ఫోన్ బూత్( phone booth)  అనగానే ఓ కుర్ర బ్యాచ్ గుర్తుకు రావాలే మీకు...ఖచ్చితంగా ప్రతి బూత్ ముందు ఓ ఇద్దరు మాట్లాడుకుంటు ...టైం పాస్ చేస్తు ఆడపిల్లలకు సైట్ వేయడం ఇంకా గుర్తే. ఇవి కూడా చిన్న చిన్న సరదాలే.
క్రమేణా ల్యాండ్ లైన్( land line)  నుంచి కాయిన్ బాక్స్ ...అసలు ఆ కాయిన్స్ కోసం వెయిట్ చేసినంత ఎవ్వరి కోసం వెయిట్ చేసి ఉండరు. నాకు తెలిసి 90 బ్యాచ్ అంతా ఈ కాయిన్ బాక్స్ కి బాగా కనెక్ట్ అవుతారు.


రూపాయి బిల్ల ( rupee coin) అది అందించడానికి పక్కనే ఓ ఫ్రెండ్ ...నిజం చెప్పండి ఇది వినగానే మీకు ఎవరైనా ఫ్రెండ్ గుర్తొచ్చిందా..ప్రతి ఫ్రెండ్ అవసరమే మరి. సగం లవ్ స్టోరీస్ ఈ కాయిన్ బాక్స్ లో ముచ్చట్లు పెట్టినవాళ్లే. ల్యాండ్ లైన్ ను మరిచిపోయేలా చేసిన వయ్యారి ..ఈ కాయిన్ బాక్స్ . 


డిజిటల్ లైఫ్ ( digital life)వల్ల బాగా నష్టపోయింది ఎవర్రా అంటే ...వికలాంగులు. ఈ ఫోన్ బూత్ కూసంత ఆసరాగా ఉండేది. ఎవ్వరి మీద ఆధారపడకుండా ..చిన్న ఫోన్ బూత్ ( phonebooth)పెట్టుకొని గౌరవంగా బతికేవారు. కాని ఇప్పుడు మనం ఆన్ లైన్ డెలివరీ( online delivery) లకి అలవాటు పడ్డాం. ఇంటి గేటు ముందు వదిలినా ..తప్పే అంటున్నారు. దీని వల్ల పాపం వికలాంగులకు మాత్రం దారి లేకుండాపోయిందబ్బా. కాని ఏం చేస్తాం..లైఫ్ ముందుకు వెళ్తుూనే ఉంటుంది కదా...ప్రతి చిన్న మార్పు ఓ తీపి గుర్తే.