VidaaMuyarchi: అజిత్ ‘విడాముయ‌ర్చి’ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌( AJITH KUMAR), లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్నక ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’( VIDIMUYARCHI)  నుంచి క్రేజీ అప్ డేట్ రిలీజ్ చేశారు మూవీ టీం.


Published Jun 30, 2024 10:13:00 PM
postImages/2024-06-30/1719765840_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌( AJITH KUMAR), లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్నక ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’( VIDIMUYARCHI)  నుంచి క్రేజీ అప్ డేట్ రిలీజ్ చేశారు మూవీ టీం.


 ‘విడాముయ‌ర్చి’ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అజిత్ ఓ బ్యాగ్ పట్టుకుని రోడ్ పై నడుస్తూ వస్తుండడాన్ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూడొచ్చు. అజిత్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (GAMBLER) ). 'మంగాత' చిత్రంలో అజిత్ కుమార్‌, త్రిష‌,( TRISHA)  యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.  ఈ చిత్రం పై తమిళ్ జనాలకు భయంకరమైన బజ్ ఉంది.


విడాముయర్చి' చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సగం బిజినెస్ ఇక్కడే అయిపోయిందని ..మరో సగం ...తెలుగు , తమిళ్ రిలీజ్ తో వస్తుంది . కలక్షన్స్ పై మంచి హోప్స్ తో ఉన్నారు మూవీ టీం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news

Related Articles