Volvo bus : వాహనాలపైకి దూసుకెళ్లిన వోల్వో బస్సు.. 4 బైకులు, 4 కార్లు ధ్వంసం

బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే హెబ్బాల్ ఫ్లై ఓవర్ మీద ఓ వోల్వో  ముందు వెళ్తున్న టూవీలర్లు, కార్లపైకి దూసుకెళ్లింది. బస్సు పెద్దగా వేగంగా లేకపోయినా అదుపు తప్పి  ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లింది.


Published Aug 13, 2024 02:38:32 PM
postImages/2024-08-13/1723540112_VolvoBusKarnataka.jpg

న్యూస్ లైన్ డెస్క్ : దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినా.. ఎదుటి వారు సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే జరిగే ప్రమాదం ఎవరి ప్రాణాలనైనా తీయొచ్చు. ఓవర్ స్పీడ్, నిద్ర లేకపోవడం, నైపుణ్యం, అనుభవం లేకపోవడం, నిర్లక్ష్యం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల నిత్యం దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతే కొందరు వైకల్యంతో జీవితాంతం చేయని తప్పు వల్ల శిక్ష అనుభవిస్తున్నారు. జరిమానాలు, శిక్షలు విధించినా పరిస్థితిలో మార్పు రావడం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. తాజాగా ఓ వోల్వో బస్సు అదుపు తప్పి నడిరోడ్డపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే హెబ్బాల్ ఫ్లై ఓవర్ మీద ఓ వోల్వో  ముందు వెళ్తున్న టూవీలర్లు, కార్లపైకి దూసుకెళ్లింది. బస్సు పెద్దగా వేగంగా లేకపోయినా అదుపు తప్పి  ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లింది. ఈ ఘటనలో నాలుగు బైకులు, నాలుగు కార్లు డ్యామేజ్ అయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ దృశ్యాలు బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

కొన్నిరోజులుగా కర్ణాటకాలో యాక్సిడెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దాదాపు 44 వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 11వేల 611 మంది చనిపోగా.. 51, 207 మంది గాయాల పాలయ్యారు. రోడ్డు ప్రమాదాల విషయంలో కర్ణాటక దేశంలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చండీగఢ్ నిలిచింది.

newsline-whatsapp-channel
Tags : karnataka- crime free-bus latest-news news-updates

Related Articles