ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫస్ట్ హాఫ్ అయితే తెగ నవ్వుతెప్పిస్తుంది. అసలు కథేంటో చూసేద్దాం..
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆగష్టు 15వీకెండ్ కి పక్కా ఎంటర్ టైనర్ . నిన్న నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు సూపర్ హిట్టు..ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫస్ట్ హాఫ్ అయితే తెగ నవ్వుతెప్పిస్తుంది. అసలు కథేంటో చూసేద్దాం..
కథ చూసేద్దాం..
హీరో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్..హీరో కరోనా టైంలో వర్క ఫ్రం హోమ్ చేయడానికి ఊరికి తిరిగి వస్తాడు. కథ పరంగా పెద్దగా మ్యాజిక్ ఏమి చేయకపోయినా సాదాసీదా కథకి మంచి కామెడీని కలిపి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగేలా చేశారు టీం. తన చిన్నప్పటి ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ తన వర్క్ చేసుకుంటూ ఉన్న తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఊరును ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ టైంలోనే హీరోయిన్ తో లవ్ లో పడతాడు.
ఫస్ట్ ఓకే చెప్తుంది. తర్వాత మాత్రం వేరే అబ్బాయితో పెళ్లికి హీరోయిన్ సిధ్ధం అవుతుంది. ఆ తర్వాత కథ ఏమయ్యిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చాలా నార్మల్ కథ పాయింట్ తో వచ్చిన ఆయ్ మూవీ కథపరంగా కామన్ స్టోరీ అయినా ..యాక్టింగ్ తో అద్దరగొట్టేశాడు. ఓవరాల్ గా సినిమాలో 100 కి 90% సీన్స్ మొత్తం కామెడీ సీన్స్ తోనే నింపేశారు….హీరో అండ్ ఫ్రెండ్స్ అందరూ నవ్వించడమే పనిగా పెట్టుకోవడంతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సాగిన కథ చివరి 15-20 నిమిషాలు మాత్రం కొంచం సీరియస్ గా టర్న్ తీసుకుంటుంది కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం కామెడీతో దుమ్ము లేపారు. హీరోయిన్ అయితే చంపేసింది. రాజ్ కుమార్ కసిరెడ్డి సినిమాలో కామెడీ చంపేశాడు.మీద సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించాయి… ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి సినిమా అన్ని కలిపిన మంచి బిర్యానీ తిన్నట్లుంటది.
ఈ గోదావరి యాస సినిమా కథ కు డైరక్టర్ ఎంచుకున్న పాయింట్ కు చాలా బాగా సెట్ అయ్యింది. కథ సింపుల్ గా ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకోవడం. ఈ వీక్ అండ్ మీకు పర్ఫెక్ట్ సినిమా.