గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులతో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత పలువురు నేతలు వైసీపీకి దూరం అవుతున్నారు. గెలిచిన వాళ్లతోనే ప్రయాణం చేయాలని భావిస్తున్న పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఎమ్మెల్సీ పదవులకు కళ్యాణ్‌చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామా చేశారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులతో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎవరు పోయినా వైసీపీకి నష్టం లేదని ఆయన అన్నారు. నిజాయితీగా ఉన్న నేతలు అధికారంలో లేమనే కారణంతో పార్టీకి రాజీనామా చేయరని ఆయన అన్నారు. రాజకీయ వలసలు ప్రోత్సహించడం చంద్రబాబు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు. నటి జత్వానీ కేసు విషయంలో ప్రభుత్వానికి బూమరాంగ్ తప్పదని అన్నారు.
జత్వానీ కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సజ్జలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అంబటి విమర్శించారు. ఉత్తరాంధ్రలో MPTCలు, జెడ్పీటీసీలు బలంగా నిలిచారని గుర్తుచేశారు. అందుకే ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గెలిచారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చూసి.. ఎంపీలు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.