Amrapali : ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ పూర్తి బాధ్యతలు.. మరో ఐదుగురికి పలు శాఖలు

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ, మూసీ డెవలప్ మెంట్, హెచ్.జీ.సీ.ఎల్ అదనపు బాధ్యతల నుంచి ఆమ్రపాలిని తప్పించి జీహెచ్ఎంసీ పూర్తి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.


Published Aug 20, 2024 08:02:18 PM
postImages/2024-08-20/1724164338_KattaAmrapali.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ, మూసీ డెవలప్ మెంట్, హెచ్.జీ.సీ.ఎల్ అదనపు బాధ్యతల నుంచి ఆమ్రపాలిని తప్పించి జీహెచ్ఎంసీ పూర్తి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్ గా నేటి నుంచి ఆమ్రపాలి పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.

మూసీ అభివృద్ధి కార్పోరేషన్ ఎండీగా దానకిశోర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్కి అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాస్తవ, కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా చహత్ బాజ్ పాయ్, హైదరాబాద్ జలమండలి ఈడీగా మయాంక్ మిట్టల్ ను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

newsline-whatsapp-channel
Tags : hyderabad cm-revanth-reddy amrapali ghmc ghmc-council musi-river musi-beautification-project

Related Articles