మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు అనేది మంచి ముహూర్తాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. ముహూర్తాలు లేకపోతే జీవితం సరిగ్గా సాగదని నమ్ముతారు. అందుకే పెళ్లిళ్లకు మంచి ఘడియలు చూసి పండితుల మంత్ర
న్యూస్ లైన్ డెస్క్:మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు అనేది మంచి ముహూర్తాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. ముహూర్తాలు లేకపోతే జీవితం సరిగ్గా సాగదని నమ్ముతారు. అందుకే పెళ్లిళ్లకు మంచి ఘడియలు చూసి పండితుల మంత్ర ఉచ్చారణ మధ్య మూడు ముళ్ళు, ఏడడుగులతో వివాహ బంధంలోకి అడుగుపెడతారు. అలా ఈ మూడు ముళ్ళు ఏడడుగుల బంధానికి స్వాగతం పలకడం కోసం ఎంతోమంది జంటలు ఎదురుచూస్తున్నారు.
గత మూడు నెలలుగా ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేక సతమతమవుతున్నటువంటి వారికి ఒక చక్కని శుభవార్త అందించారు జ్యోతిష్య పండితులు. ఈ తేదీల్లో చక్కని ముహూర్తాలు ఉన్నాయని పెళ్లి చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుందని తెలియజేస్తున్నారు. మరి ఏ ఏ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి అనే వివరాలు చూద్దాం. ఏప్రిల్ 28 నుంచి గురు మూడమీ రావడంతో పెళ్లిళ్లకు అవాంతరాలు ఏర్పడ్డాయి.
ఇవాల్టి నుంచి శ్రావణమాసం మొదలైపోయింది. దీంతో మూడు నెలలు బ్రేక్ పడిన వివాహాలకు సంబంధించి ఆగస్టు 7వ తేదీ నుంచి 28వ తేదీ అనేక ముహూర్తాలు ఉన్నాయి. ఈ సమయంలో కేవలం పెళ్లిల్లే కాకుండా గృహప్రవేశాలు మంచి పనులకు శంకుస్థాపనలు వ్యాపార సముదాయాల ఏర్పాట్లకు సంబంధించిన ముహూర్తాలు కూడా బాగుంటాయట. ఆగస్టు 5న మొదలయ్యే శ్రావణమాసం సెప్టెంబర్ 3 తో ముగుస్తుంది.
ఈ సమయంలోనే ముహూర్తాలు అనేకం ఉన్నాయని ఇందులోనే ఏదైనా మంచి పనులు చేసుకోవాలనీ జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఆగస్టు 7, 8, 9, 10, 11, 15, 16, 17, 18, 21, 22, 23, 24, 28 తేదీలలో పెళ్లిళ్లు చేసుకోవడానికి అణువైన ముహూర్తాలు ఉన్నాయట. అంతేకాకుండా 17, 18 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.