మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వాకిటి సునీత, సత్యవతి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఇతర పార్టీ నేతలు కూడా మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. అయితే, BRS మహిళా నేతలను మహిళా కమిషన్ అధికారులు లోపలికి అనుమతించలేదు.
న్యూస్ లైన్ డెస్క్: బుద్ధ భవన్ వద్ద ఉన్న మహిళా కమిషన్ ఆఫీసు వద్ద BRS మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. శనివారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి మహిళా కమిషన్ కార్యాలయానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వాకిటి సునీత, సత్యవతి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఇతర పార్టీ నేతలు కూడా మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. అయితే, BRS మహిళా నేతలను మహిళా కమిషన్ అధికారులు లోపలికి అనుమతించలేదు.
ఆఫీసు కిందనే కూర్చొని ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు BRS మహిళా నేతలపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్, BRS మహిళా కార్యకర్తల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే, తోపులాట సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు BRS మహిళా నేతలపై నెయిల్ కట్టర్ వంటి వస్తువులతో దాడి చేశారని BRS వర్గాలు ఆరోపిస్తున్నాయి.