కులాల గొడవలు , డబ్బు ఇబ్బంది, పేదరికం లాంటివి ఎన్నో ఇబ్బందులు. కొన్ని సార్లు మనకి అనిపిస్తుంటుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత దేశాన్ని అభివృధ్ధి చెందుతున్న దేశం అంటారు. ఎందుకంటే భారత్ లో అన్ని ఇబ్బందులే ...రిజర్వేషన్లు ఇబ్బంది, మతాలు , కులాల గొడవలు , డబ్బు ఇబ్బంది, పేదరికం లాంటివి ఎన్నో ఇబ్బందులు. కొన్ని సార్లు మనకి అనిపిస్తుంటుంది..డబ్బు ప్రస్తావన లేని జీవితం ఎంత బాగుంటుందో అని ...అన్ని ఇబ్బందులు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.
అయితే భారతదేశంలో డబ్బులు అవసరం లేకుండా నివసించడానికి వీలైన ఒక నగరం ఉంది. అది కూడా ఎక్కడో దూరంలో కాదు మన పక్క రాష్ట్రం లోనే. ఈ సిటీ లో బతకడానికి డబ్బు అవసరం లేదు. ప్రశాంతంగా బ్రతకడానికి మాత్రమే సంపాదించుకుంటే చాలు. ఏ ప్రభుత్ం పాలించదు. ఇక్కడ కులం లేదు, మతం లేదు . రిజర్వేషన్లతో పనిలేదు. ఇక్కడ ఆడ , మగ లింగభేధం లేదు. జస్ట్ ఇక్కడ బ్రతకడానికి ఎన్నో వేల మంది ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.ఈ నగరం పేరు 'ఆరోవిల్'. ఈ నగరం చెన్నైకి 150 కి.మీ దూరంలో తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఉంది.
భారత్ లో ఎప్పుడు రూల్ చేసే వారు ఉన్నారు. అణచబడిన వారు ఉన్నారు. మత కల్లోలాలు ఉన్నాయి, రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయి.అయితే ఒక నగరం ప్రభుత్వం ఏలుబడిలో లేదు.. అంతేకాదు ఈ నగరం డబ్బులు లేకుండా నడుస్తోంది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ నగరంలో జీవించడానికి తినడానికి డబ్బు అవసరం లేదు. మరి అలాంటి నగరం మన దేశంలోనే ఉందంటే చాలా మందికి ఆశ్చర్యమే. ఇక్కడ ప్రధాన సూత్రం పనిచెయ్యాలి. వారి పెట్టింది తినాలి. ఇక్కడ ప్రత్యేకమైన మతం లేదు. జస్ట్ ఓ గుడి ఉంటుంది ..ఆ గుడిలో దేవుడు కాదు చెట్లు ఉంటాయి. కంటికి కనిపించే వాటినే ఆరాధించాలని అక్కడి సూత్రం, పనిచెయ్యాలి..తినాలి..కంటి నిండా నిద్రపోవాలి. టెన్షన్ ఫ్రీ లైఫ్.
ఈ సిటీలో ఇప్పటికి దాదాపు 40 దేశాల ప్రజలు ఉన్నారు. అన్ని దేశాల నుంచి ఇక్కడ బతకవచ్చు. కాని ఈ ఊరుకి కొన్ని నియమాలున్నాయి. వాటిని పాటించగలిగితేనే ఈ సిటీలోకి ఎంట్రీ . అయితే ఇప్పటికి ఈ ఊర్లో బతకడానికి అర్జీ పెట్టుకున్నవాళ్లు ఎన్ని వేల మంది వెయిటింగ్ ఉన్నారని టాక్. ఏదైనా డబ్బు లేని సిటీ అంటే భలే అనిపిస్తుందికదా.