CEO : ఈ అలవాట్లు ఉంటే సీఈవో చేయడం ఖాయం

ప్రత్యేకమైన లక్షణాలుంటేనే తన టార్గెట్ రీచ్ అవుతారంటున్నారు. ప్రపంచంలో టాప్‌ 10 కంపెనీల సీఈవోలు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు.


Published Aug 21, 2024 08:34:00 AM
postImages/2024-08-21/1724209476_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఇప్పుడున్న యూత్ కు చాలా తక్కువ మంది పెద్ద పెద్ద లక్ష్యాలుంటున్నాయి. కాని లక్ష్యాన్ని చేధించే సమయంలో మాత్రం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుంటేనే తన టార్గెట్ రీచ్ అవుతారంటున్నారు. ప్రపంచంలో టాప్‌ 10 కంపెనీల సీఈవోలు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు.


* క్రియేటివ్ ఐడియాస్


కొత్తగా ఆలోచించడం అనేది చాలా మంచి అలవాటు..ప్రతి స్టేజ్ లోను ఈ అలవాటు మిమ్మల్ని సాధారణ ఉద్యోగి నుంచి మిమ్మల్ని ఉన్నతస్థానంలో ఉంచుతుంది. 


*ఫైనాన్సియల్ రిపోర్ట్స్, బడ్జెట్స్ ను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉండాలి. పెట్టుబడి అవకాశాలను కనిపెడుతూ ఉండాలి. చాలా మంచి టాకిటివ్ గా ఉండాలి. మీ అభిప్రాయాన్ని నిర్భయంగా స్మార్ట్ గా బయటపెట్టే టాలెంట్ ఉండాలి.


* రిస్క్ మానేజ్మెంట్ 


ఈ పోటీ ప్రపంచంలో వేగంగా అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే చాలా వేగం కరెక్ట్‌ నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.  సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే మీరు చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ప్రతి అవకాశాన్ని అందుకోవాలి. అలానే వచ్చే రిస్క్ ను పసిగట్టాలి.


* మార్కెట్ విశ్లేషణ

మార్కెట్లో మీ పోటీదారులు ఎప్పుడు మీ కంటే స్పీడ్ గా ఉంటారు. కాబట్టి ఎక్కువ ఆలోచించకండి. ఎప్పుడు మార్కెట్ కదలికలు ఆలోచించాలి. మీ వ్యాపారం బాగుండాలని నిర్నయాలు తీసుకొండి.


* ఆర్థిక చతురత


మీ వ్యాపార బడ్జెట్ కు అవసరమైన పెట్టుబడిని ఏవిధంగా సంపాదించాలన్న అంశంపై మీకు స్పష్టత ఉండాలి. ఇది మీ వ్యాపారం సజావుగా సాగేలా చేస్తుంది. 


* నాయకత్వ లక్షణాలుండాలి..మీ సంస్థ మీతో పాటు ...పనిచేసి ...లాభాల కోసం పనిచెయ్యాలి. మీరు వారి కోసం ఆలోచించాలి. మీ లాభాలు రెండు మీ నాయకత్వ లక్షణాలు బాగుంటే సంస్థ బాగుంటుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style good-qualities

Related Articles