Deputy CM: అప్రమత్తంగా ఉండండి

భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగుల వరద ఉధృతిపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌గా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామన్నారు. 


Published Sep 01, 2024 01:19:46 PM
postImages/2024-09-01/1725176986_bhatti2.jpg

న్యూస్ లైన్, మధిర: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఆదివారం విద్యుత్ సమస్యలపై మధిర తహశీల్దార్ కార్యాలయం నుంచి విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్, పోలీస్ రెవెన్యూ జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేయాలని ఆదేశించారు. 

వరదల వల్ల నీట మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న చోట మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా వాటి పరిధిలో ఉన్న గ్రామాలకు పక్క సబ్ స్టేషన్ నుంచి విద్యుత్తును సరఫరా అందించేలా చూడాలన్నారు. 24/7 అలర్ట్ గా ఉండి కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అమలు చేయాలని ఆదేశించారు. 

భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగుల వరద ఉధృతిపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌గా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామన్నారు. విద్యుత్తు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భట్టి సూచించారు. శిథిలమైన పురాతన భవనాల్లో ఉండకుండా వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు. విద్యుత్ అంతరాయానికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజలు 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి కంట్రోల్ రూమ్ నుంచి నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam rains weather-update bhattivikramarka

Related Articles