నేను ఓక్లా, సంగం విహార్ మాదిరి కల్కాజీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా మారుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రియాంకా గాంధీ పై బీజేపీ నేత రమేష్ బిధూరీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే స్థానిక రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా ఢిల్లీ రోడ్లు వేస్తానని తెలిపారు. గతంలో బిహార్ రోడ్లను హేమ మాలిని బుగ్గల్లా చేస్తానని లాలూ ప్రసాద్ మాట తప్పారు. కానీ నేను ఓక్లా, సంగం విహార్ మాదిరి కల్కాజీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా మారుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిషి పై బీజేపీ తరుపున రమేష్ బిదూరి పోటీ చేస్తున్నారు. బీజేపీ ఇప్పటికే ఆయనను ప్రకటించింది. ఈ విషయం పై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది. వాస్తవమేనని ఒప్పుకున్నారు . ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలిని పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఆయన చేసింది తప్పు అయితే తనది కూడా తప్పేనని పేర్కొన్నారు.