తెలంగాణ ఆడబిడ్డలకు భద్రత లేదని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ఆడబిడ్డలకు భద్రత లేదని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలోని ఆడబిడ్డలపై రోజుకో ఘోరం, అత్యాచారం జరుగుతుంటే.. నిమ్మకు నీరేత్తని ప్రభుత్వం తీరును నిరసిస్తూ బుధవారం అసెంబ్లీని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు ముట్టడించారు. ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తున్న మహిళా మోర్చా నాయకురాళ్లను అరెస్ట్ చేయడంలో ఉన్న నిబద్ధత, మహిళలకు భద్రత కల్పించడంలో ఎందుకు లేదని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారం, దారుణాలపై సీఎం రేవంత్ మౌనం వీడలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకేరోజు ఇద్దరు మహిళాలపై అగాయిత్యాలు జరిగి రాష్ట్రంలో మహిళలోకం అల్లకల్లోలం అయితున్న అసెంబ్లీలో దీనికి గురించి ఊసే తీయకుండా పార్టీ చేరికలపై దృష్టి సారించిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. బాధిత మహిళలకి న్యాయం చేసేవరకు పోరాడుతమని వారు తెలిపారు.
పార్టీల ఫిరాయింపులు, అసత్య ప్రచారాలపై అసెంబ్లీ సాక్షిగా కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వానికి ఆడబిడ్డలకు జరుగుతున్న ఘోరాలపై చర్చించే తీరిక లేదా? అని ప్రశ్నించారు. మహిళ పై జరుగుతున్న ఆరాచకాలను అరికట్టడంలో జాప్యం చేస్తే, భారీ మూల్యం తప్పదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చారించారు. ముందుగా హోంశాఖను కేటాయించి ముఖ్యమంత్రి హోదను చాటుకోవాలని లేని రీతిలో రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డాక్టర్ శిల్పారెడ్డి డిమాండ్ చేశారు.