ఖమ్మం వరద బాధితులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భరోసనిస్తూ దైర్యం చెప్తుంటే దాడులు చేస్తారా అని బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం వరద బాధితులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భరోసనిస్తూ దైర్యం చెప్తుంటే దాడులు చేస్తారా అని బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రజలకు సహాయం చేస్తుంటే ప్రాణాలు తీయాలని చూడటమేన కాంగ్రెస్ ప్రజా పాలన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేయవద్దని చెప్పి, నేడు గుండాయిజం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లపై, తమ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంత దౌర్జన్యం, అధికార అహంకారం పనికి రాదని మండిపడ్డారు. ప్రతిది ప్రజలు గమనిస్తున్నారని, రేపటి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ తగిన బుద్ధి చెబుతారు అని రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.